చిరంజీవి కోసం చాలా కష్టపడుతున్న బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

chiranjeevi
Updated:  2018-08-29 12:49:11

చిరంజీవి కోసం చాలా కష్టపడుతున్న బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్

"సై రా నరసింహ రెడ్డి" సినిమాకి మొదట బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ని పెడుతున్నారు అంటే చాలా మంది అతను వద్దు అని చిరంజీవికి చెప్పారు అంట. కానీ మొన్న రిలీజ్ అయిన టిజర్ లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూసాక అందరూ ముక్కున వేలేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంభందించిన అన్ని పాటలు రికార్డింగ్ చేసేసాడు అంట అమిత్. అన్నీ పాటలు అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి అని ఫిలిం నగర్ టాక్. సినిమాలో వచ్చే చాలా పాటలు జానపద గీతాలుగా ఉండనున్నాయి అంట. ఈ పాటలు కూడా కథని ముందుకు తీసుకొని వెళ్తాయి అందుకే అమిత్ త్రివేది లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ని ఈ సినిమా కోసం తీసుకున్నాము అని మూవీ యూనిట్ అంటున్నారు.

అదే విధంగా అమిత్ త్రివేది కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు అని ఫిలిం నగర్ టాక్. ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మక సినిమాగా తెరకెక్కుతుంది కాబట్టి అమిత్ కూడా అది దృష్టి లో ఉంచుకొని కష్టపడుతున్నాడు అని తెలిసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ కానుంది. ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా టిజర్ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు పెంచేశాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.