అతను ఉంటే మేము ఔట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood
Updated:  2018-09-07 01:28:03

అతను ఉంటే మేము ఔట్

కామెడీ యాక్టర్ గా ఉన్నప్పుడే పట్టాలు తప్పి హీరో అవతారం ఎత్తాడు సునీల్. మొదట్లో సాఫీగానే సాగినా తర్వాత బండి చతికిల పడింది. హీరోగా చాలా కాలం నుండి ఒక్క హిట్ కూడా లేని సునీల్ ఎందుకొచ్చిన్న ఖర్మ రా బాబు అనుకుంటూ మళ్ళీ కామెడీని ఎంచుకున్నాడు.
 
‘సిల్లిఫెల్లోస్’ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు.భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 7వ తారికున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో బ్రహ్మనందం సునీల్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
 
సునీల్ లక్కీగా కొంత గ్యాప్ ఇచ్చాడు. లేకపోతె మేమంతా ఎప్పుడో పెట్టాబేడా సర్దుకోవాల్సినోళ్ళం. అయన కొంతకాలంగా హీరోగా చేస్తూ అటువైపు వెళ్లిపోవడం వల్లనే మేము ఇండస్ట్రీలో ఉన్నామని బ్రహ్మానందం చమత్కరించారు.
 
హీరోగా చేస్తున్నప్పుడు కూడా కామెడీ ప్రధాన చిత్రాలను ఎక్కువగా చేసేవాడు. ఎప్పటికైనా కామెడీనే తన బలం అని చెప్పేవాడు. మళ్ళీ పాత సునిల్ రాబోతున్నాడు. మిగిలిన నటీనటుల గురించి తెలియదు కానీ, నాకు కొంచెం బద్ధకం ఎక్కువ. కానీ, సునీల్ గొడ్డులా పనిచేస్తాడు. ఎంత పని ఉన్నా, ఎంత కష్టమైనా, ఎంత బాధ ఉన్నా భరిస్తాడు అని సునీల్ ని పొగడ్తలతో ముంచేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.