బుల్లితెర పై బ్ర‌హ్మానందం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

brahmanandam
Updated:  2018-08-23 04:57:35

బుల్లితెర పై బ్ర‌హ్మానందం

తెలుగు స్టార్ హీరోస్ అయిన చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ అటు సినిమాలతో పాటు బుల్లితెరపై యాంకర్స్ వచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇదే కోవలో స్టార్ కమెడియన్ అయిన బ్రహ్మానందం కూడా రానున్నాడు. స్టార్ మా లో బ్రహ్మానందం హోస్ట్ గా ఓ కామెడీ షో ప్రారంభం కానున్నది. అందుకు సంభందించిన ట్రైలర్ ఇటివలే రిలీజ్ అయ్యింది. 

ప్రస్తుతం ఈ షోకు సంబందించిన ఆడిషన్స్ మొదలయ్యాయి. స్టార్ మా లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో తర్వాత ఈ కామెడీ షో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ట్రైలర్ ను విభిన్నంగా డిజైన్ చేసి షోపై ఆసక్తి కలిగించేలా నిర్వాహకులు చేశారు. బ్రహ్మానందం ఎంట్రీ ఇవ్వగానే ఆడిటోరియంలోని జనం అంతా కూడా నిల్చుని మరి నవ్వేస్తూ ఉంటారు.

అప్పుడే బ్రహ్మానందం స్టాండప్‌ కామెడీ అంటే కూర్చుని కూడా నవ్వొచ్చు అనగానే అందరూ కూర్చుంటారు. ఈటీవీ జబర్దస్త్‌ కామెడీ షోకు ఈ షో ని పోటీగా నిలపాలి అని స్టార్ మా వాళ్ళు భావిస్తున్నారు అని టాక్. మరి ప్రస్తుతం సినిమాలు తగ్గించేసిన బ్రహ్మానందం ఈ షో తో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. 

షేర్ :