బ్రాహ్మణి వల్ల ఎమోషనల్ అయిన ఎన్టీఆర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr and brahmani
Updated:  2018-10-22 11:25:25

బ్రాహ్మణి వల్ల ఎమోషనల్ అయిన ఎన్టీఆర్

బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ అన్నా చెల్లెలు అవుతారు అని తెలిసిన విషయమే. ఈ రెండు కుటుంబాల మధ్య కొంత అంతరం ఉన్నప్పటికీ, హరికృష్ణ మరణం తరువాత ఇరు కుటుంబాల మధ్య దూరం తగ్గిందని వార్తలు వినిపించాయి. దాని వల్ల ఈ అన్నా, చెల్లెళ్ళ మధ్య బంధం కూడా గట్టిపడినట్టు తెలుస్తోంది.

ఈ మధ్యనే బ్రాహ్మణి, ఎన్టీఆర్ కి పంపిన గిఫ్ట్ దీనికి సాక్ష్యం. బ్రాహ్మణి పంపిన ఆ గిఫ్ట్ ని చూసి ఎన్టీఆర్ ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. అసలు విషయానికి వస్తే, నందమూరి హరికృష్ణ కు సంబందించిన కొన్ని ఫోటోలు బాలయ్య ఇంట్లో ఉన్నాయట. అందులో చాలా ఫోటోలు ఎన్టీఆర్ కు పెద్దగా తెలియదట.దాంతో పెద్దనాన్న కు చెందిన కొన్ని ఫోటోలను ఒక ఆల్బం లా చేయించి ఎన్టీఆర్ కు బహుమతిగా పంపింది బ్రాహ్మణి. చెల్లెలు అభిమానంతో చేయించి ఇచ్చిన ఆల్బం ని చూసి ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా కంటతడి పెట్టుకున్నారట.

ఆ ఆల్బమ్ ను భద్రంగా దాచుకుంటున్న ఎన్టీఆర్ కి చెల్లెలి పై ప్రేమ రెట్టింపు అయిందట. ఇక ఈ ఆల్బమ్ పెద్ద గిఫ్ట్ అనుకుంటే, అరవింద సమేత చూసాను, చాలా బాగా యాక్ట్ చేసావ్ అన్నయ్యా అని బ్రాహ్మణి అంటుంటే ఎన్టీఆర్ మరింతగా సంతోషంలో మునిగి తేలుతున్నాడట. మొత్తానికి వీరి మధ్య సంబంధాలు బల పడడంతో నందమూరి ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు.