ముక్కలైన మనికర్ణిక క్రిష్ ఔట్, సోను సూద్ కి కోపం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

krish and sonusood
Updated:  2018-09-12 01:13:59

ముక్కలైన మనికర్ణిక క్రిష్ ఔట్, సోను సూద్ కి కోపం

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తో తన సత్తా చాటిన దర్శకుడు క్రిష్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ని వదిలేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చరిత్రాత్మక చిత్రం’మనికర్ణిక’ను కంగనా రనౌత్‌తో పడకపోవడంవల్ల వైదొలిగాడు. నేరుగా ప్రకటించక పోయిన ఆ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే క్రిష్ ‘ఎన్టీఆర్’ బయోపిక్ దర్శకత్వంలో మునిగిపోయాడు. క్రిష్‌తో కంగనకి చాలా విషయాల్లో అభిప్రాయబేధాలు వచ్చాయట.

అయినా కానీ అలాగే షూటింగ్‌ చేసేసారట. కానీ ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత క్రిష్‌ వచ్చేసాడని, అక్కడ్నుంచి బ్యాలెన్స్‌ షూటింగ్‌ కంగన దర్శకత్వంలో పూర్తి చేస్తున్నారని వినికిడి. సోనూ సూద్‌పై క్రిష్‌ తీసిన మల్లయుద్ధం సన్నివేశాలని తొలగించడం వల్లే సూద్‌ కూడా అలిగి వెళ్లిపోయాడని సమాచారం. ఈగోకి పోతున్న ఈ ‘ఎక్ నిరంజన్’ పాప క్రిష్‌ తీసిన సన్నివేశాలని తొలగించేస్తోందట. తాజాగా క్రిష్‌ తీసిన సీన్లలో నలభై మూడు రోజులకి చెందిన వర్క్‌ని కంగన తెసేసిందట.

ఇప్పుడు దానిని రీషూట్‌ చేసేపనిలో ఈ ఇగో సుందరి బిజీ గా ఉందట. దీని వల్ల నిర్మాతలకి తీవ్రమైన నష్టం అయినా కానీ కంగనకి ఎదురు చెప్పలేక వారు కిక్కురుమనడం లేదట. మొత్తానికి ఈ చిత్రంపై క్రిష్‌ ముద్ర సాంతం చెరిపేసి తనదే సినిమా అనిపించుకోవాలని కంగన చూస్తున్నట్టుంది. దర్సకత్వం దాదాపు పూర్తి చేసినా..ఆ క్రెడిట్ ని క్రిష్ కి ఏ మాత్రము దక్కనిచ