నేను చాలా నెమ్మది అంటున్న బన్నీ స్నేహితుడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

allu arjun
Updated:  2018-09-18 05:13:33

నేను చాలా నెమ్మది అంటున్న బన్నీ స్నేహితుడు

చిత్ర పరిశ్రమలో స్నేహితులు కలకాలం ఉంటారా అనేది పెద్ద ప్రశ్నే. అయితే తన స్నేహితుని పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న బన్నీ వాసు మాత్రం దీనికి భిన్నంగా ఎప్పటికి బన్నీతోనే ఉండేలాకనబడుతున్నాడు. బన్ని అంటే వాసూకి - వాసు అంటే బన్నీకి అంతటి అభిమానం. బన్నీ కమిట్మెంట్ గురించి బన్నీ వాసు పలు ఆసక్తికర విషయాలు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. బన్నీ అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే బన్నీ అంటూ చెప్పుకొచ్చాడు.

“ఆర్య” టైం లో జరిగిన విషయాల్ని చెప్తూ తన వాదన నిరూపించాడు. “ఆర్య” టైం లో పొద్దున ఆపరేషన్ చేయించుకుని సాయంత్రం సమయానికి షూటింగ్ పనిలో బిజీగా మారిపోవడం ఆశ్చర్యం కలిగించింది అన్నారు ఆయన. ఆరోజు ట్రాన్సిల్స్ సర్జరీ చేయించుకుని సాయంత్రానికే బెంగళూరుకు కాస్ట్యూమ్స్ కొనేందుకు వెళ్లాలని అన్నాడు. సినిమా అంటే అంత కుతూహాలం - తపన ఉన్న హీరో అతడు. పెద్ద స్టార్ అయినా కమిట్ మెంట్ పరంగా ఏ మార్పు లేని హీరో.

ప్రతి సినిమా తొలి సినిమాలానే భావించి పని చేస్తాడని బన్ని సక్సెస్ సీక్రెట్ ని చెప్పేశాడు వాసు.తాను చాలా నెమ్మదిగా ఉంటే బన్నీ చాలా దూకుడుగా ఉంటాడని చెప్పాడు ఈ ప్రొడ్యూసర్.ఇద్దరివి వేరు వేరు అభిప్రాయాలు..కానీ ఒకరి అభిప్రాయాల్ని వేరొకరు గౌరవించుకుంటాం. ఆ స్నేహం వల్లనే “గీత ఆర్ట్స్-2” బ్యానర్ స్థాపించడం జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ‘గీతగోవిందం’ ఈ బ్యానర్ మీద విడుదల అయ్యి దాదాపు 100 కోట్లు కొల్లగొట్టిన విషయం తెల్సిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.