సోనాలీ బింద్రేకు వింత క్యాన్సర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-05 13:26:01

సోనాలీ బింద్రేకు వింత క్యాన్సర్

హీరోయిన్ సోనాలీ బింద్రే త‌న‌కు అరుదైన క్యాన్స‌ర్‌ వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియా అకౌంట్ ను వేదిక‌గా చేసుకుని ట్వీట్ చేశారు. తాను కొద్ది కాలంగా హైగ్రేడ్ క్యాన్సర్ తో బాద‌ప‌డుతున్నార‌ని వెంట‌నే చికిత్స చేయించుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచించార‌ని ఆమె సోష‌ల్ మీడియాలో పేర్కోంది. మ‌నం అనుకున్నామ‌ని ప్ర‌తీది జ‌రుగ‌ద‌ని, అనుకోనిది జ‌రుగ‌కుండా ఆగ‌ద‌ని ట్వీట్ చేశారు.
sonali bendre
సోనాలి బింద్రే జననం 1 జనవరి 1975లో జ‌న్మించారు. భారతీయ సినీ నటి, మోడల్ గా త‌నకంటూ ప్ర‌త్యేక మైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించారు.మరాఠీతో పాటు, దక్షిణ భారతదేశంలో తెలుగులో మురారి,ఇంద్ర, మన్మథుడు, ఖడ్గం, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించారు. ఆమె నటించే సమయంలో అత్యంత అందమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సోనాలి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.