బ్రాండ్ బాబు సినిమా పై కేసు వేసిన జర్నలిస్ట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

brand babu movie poster
Updated:  2018-08-07 12:50:35

బ్రాండ్ బాబు సినిమా పై కేసు వేసిన జర్నలిస్ట్

స్టార్ డైరెక్టర్ అయిన మారుతి కథని అందిస్తూ తెరకెక్కిన సినిమా "బ్రాండ్ బాబు". ఈశ రెబ్బ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా సుమంత్ శైలేంద్ర హీరో గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ని ఈటీవి ప్రభాకర్ డైరెక్ట్ చేసాడు. ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.
 
అయితే ఇప్పుడు ఈ సినిమా పై ఒక మహిళా జర్నలిస్ట్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు వేసింది. ఈ మూవీలో ఆమె ఫోటోని ఆమె అనుమతి లేకుండా వాడటం పైగా ఆమె ఈ సినిమాలో చనిపోయినట్టుగా చూపెట్టడం జరిగింది.
 
అయితే తన అనుమతి లేకుండా ఫేస్ బుక్ నుండి ఆ ఫోటోని తీసుకుని సినిమాలో వాడుకున్న కారణంగా ఆమె తీవ్ర ఇబ్బందికి గురనైట్టు అందుకే బంజారా హిల్స్ లో మూవీ టీం పై కేసు వేసాను అని చెప్పుకొచ్చింది ఈమె. మరి ఈ కేసు పై రైటర్ మారుతి అలాగే దర్శకుడు ప్రభాకర్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.