బెదిరించిన కేస్ లో పోలీస్ స్టేషన్ కి యాంకర్ రవి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anchor ravi
Updated:  2018-10-29 04:46:12

బెదిరించిన కేస్ లో పోలీస్ స్టేషన్ కి యాంకర్ రవి

యాంకర్ రవి, టి.వి షో ల ద్వారా బుల్లితెర ప్రేక్షకులందరికి సూపరిచితుడే. మా టి.వి లో వి.జె గా మొదలైన రవి ప్రస్థానం ఈ టీవీ ప్లస్ లో పలు షో లకి యాంకర్ గా కొనసాగుతున్నాడు. పటాస్ షో తో మంచి క్రేజ్ అందుకున్నాడు రవి. ఈ మధ్య ఆడియో లాంచ్ లకి, అవార్డ్ ఫంక్షన్లలో కూడా రవి సందడి చేస్తున్నాడు. అయితే కొంతమందిని తీసుకొచ్చి బెదిరించిన కేసులో రవి పై కేసు నమోదు అయ్యింది.

మంచి డిమాండ్ ఉండటంతో బాగానే సంపాదిస్తున్నాడు. అలా వచ్చిన సొమ్ములో కొంత సందీప్ కి ఇచ్చాడు అయితే సందీప్ సకాలంలో డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండటంతో తన స్నేహితులను తీసుకొని అతడి పై దాడికి పాల్పడ్డాడు దాంతో సందీప్ పోలీసులను ఆశ్రయించాడు. టివి షోలలో మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు యాంకర్ రవి.

ఇక ఒక సినిమాలో హీరోగా కూడా నటించాడు. ఆ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా తెలియదు ప్రేక్షకులకు. రవిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవి ని పిలిచి విచారణ చేసారట అయితే అతడ్ని అరెస్ట్ చేయకుండా రవిని పంపించారట మళ్ళీ అవసరమైతే పిలుస్తామని అప్పుడు విచారణకు మళ్ళీ రావాల్సి ఉంటుందని చెప్పారట పోలీసులు .

షేర్ :