జబర్దస్త్ పై పోలీస్ కంప్లైంట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jabardasth show
Updated:  2018-10-16 03:11:39

జబర్దస్త్ పై పోలీస్ కంప్లైంట్

మొదలై చాలా రోజులు అయినప్పటికీ, ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ టీవీ షో కి మంచి టిఆర్పీలే దక్కుతున్నాయి. ఒక వైపు జబర్దస్త్ షో ద్వారా పరిచాయమయిన చాలా మంది కమీడియన్లుగా కొందరు హీరోలుగా కూడా తెలుగు తెరపై కనిపిస్తూనే ఉన్నారు. అయితే, ఈ షో కి ఫ్యాన్స్ బాగానే ఉన్నా కొంతమంది విమర్శకులూ ఉన్నారు.

జబర్దస్త్ లో అడల్ట్ కామెడీ మోతాదు మించుతోందని, చిన్న పిల్లలతో కలిసి ఈ షోను చూడలేక పోతున్నామని సోషల్ మీడియాలో కొందరు తల్లిదండ్రులు ట్రోలింగ్ కూడా చేశారు. తాజాగా జబర్దస్త్ మరో వివాదానికి తెరలేపింది. గల్ఫ్ కార్మికులపై చేసిన ఓ స్కిట్, గల్ఫ్ కార్మికులను, వారి కుటుంబ సభ్యులను ముఖ్యంగా మహిళలను అవమానించేలా ఉందని జగిత్యాలలో తెలంగాణ గల్ఫ్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వారిని అవమానించేలా అసభ్యకరమైన పదజాలంతో ఆ స్కిట్ చేయడం పై వారు విరుచుకుపడుతున్నారు.

ఆ స్కిట్ చేసిన అవినాష్ కార్తీక్ దిష్టిబొమ్మలను వారు దహనం చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఆ షో ని ప్రసారం చేసిన ఈటీవీ మల్లెమాల ప్రొడక్షన్స్ పై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులకు గల్ఫ్ కార్మిక సంఘాలు ఫిర్యాదు చేశాయి. అంతే కాక జబర్దస్త్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా మరియు యాంకర్ రష్మి పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఇంతకుముందు కూడా ఇలానే కల్లుగీత కార్మికులను అవమాన పరిచేలా స్కిట్ చేసినందుకు వేణుపై దాడి జరిగింది.

షేర్ :