రోబో సినిమా పై కేసు..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

robo
Updated:  2018-09-05 11:48:30

రోబో సినిమా పై కేసు..?

తన కెరీర్ లో ఇప్పటి వరకు సరైన పరాజయాన్ని చవిచూడని ఒకేఒక్క తమిళ దర్శకుడు శంకర్. తాను తీసిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించాయి. అయితే తాను ఇది వరకు తీసిన "రోబో" చిత్రం తాలూకు పెండింగ్ కేస్ ఒకటి ఇప్పుడు చికాకు పెడుతుంది.
 
ఒక సినిమా సూపర్ హిట్ అయ్యాక ఆ కథ మాదే అంటూ కోర్టు లో కేస్ లు వేసి డబ్బులు గుంజడం కొంతమందికి సర్వసాధారణం. ఇప్పుడు శంకర్ కూడా అదే చిక్కుల్లో పడ్డాడు. "రోబో" కథ నాదేనంటూ ఒక వ్యక్తి కోర్టులో శంకర్ మీద 2010 లో కేస్ వేసాడు. పలుమార్లు పరిశీలించి శంకర్ ను కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. షూటింగ్ పనులమీద బిజీ గా ఉండటం వల్ల శంకర్ కి కుదరలేదు.
 
దాంతో ఆగ్రహానికి గురైన న్యాయస్థానం అతనికి 10 వేల రూపాయలు జరిమానా విధించింది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు శంకర్ అదే సినిమాకి సీక్వెల్ తీస్తున్నాడు. "రోబో 2.o" గా రూపొందుతున్న ఈ సినిమా కూడా హిట్ అయితే ఈ కథ నాదే అంటూ ఇంకెంత మంది వస్తారో.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.