చై-సామ్ ల మొదటి పెళ్లిరోజేక్కడో తెలుసా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

chaitanya and samantha
Updated:  2018-09-25 03:36:07

చై-సామ్ ల మొదటి పెళ్లిరోజేక్కడో తెలుసా..?

“ఏ మాయ చేసావే”  స్నేహితులుగా మారి ఆ తర్వాత  ఇప్పుడు భార్య భర్తలు అయినా చై-సామ్ అంటే ఇండస్ట్రీ లో అందరికి ఇష్టమే. ఈ జంట కిందటి సంవత్సరం అక్టోబర్ నెల ఆరవ తారీఖున పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వారి మొదటి పెళ్లి రోజుకి ఎంతో సమయం లేదు. అక్కనేని వారు ఎంత ఘనం గా ఈ మొదటి పెళ్లిరోజు వేడుకని జరుపుతారో చూడాలి అనుకున్న అభిమానులకు చేదు వార్తే మిగిలింది. వీరిద్దరూ మొదటి పెళ్లిరోజుని ప్రత్యేకించి జరుపుకోవడం లేదని సమాచారం అందింది. 
 
పెళ్లి తర్వాత ఇప్పటివరకు కలిసి నటించలేదు ఈ ఇద్దరు. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా పెళ్లి తర్వాత వీరి కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే వీరి మొదటి పెళ్లిరోజుని సినిమా సెట్లో జరుపుకోవాలని నిర్ణయించారంట!
 
వారి పరిచయం సినిమా సెట్లో మొదలైంది, వారి ప్రేమ కూడా సినిమాల్లోనే స్టార్ట్ అయింది. ఆతర్వాత వారి పెళ్లికూడా సినిమాల్లో లానే చాలా గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు వారి మొదటి పెళ్లి రోజు కూడా సినిమా సెట్లో జరగడం విశేషం. చూడముచ్చటగా ఉండే ఈ జంట మరో చిత్రం లో నటించడం అక్కినేని అభిమానులకు కన్నుల పండుగనే చెప్పాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.