"ఎన్టీఆర్" బయోపిక్ స్క్రిప్ట్ విషయంలో వేలు పెడుతున్న చంద్రబాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ntr and chandrababu
Updated:  2018-08-10 02:49:02

"ఎన్టీఆర్" బయోపిక్ స్క్రిప్ట్ విషయంలో వేలు పెడుతున్న చంద్రబాబు

నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెర్కకేక్కుతున్న సినిమా "ఎన్టీఆర్". ఈ బయోపిక్ లో సీనియర్ ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్నాడు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ని స్టార్ట్ చేసుకుంది. అయితే ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ జీవితానికి సంభందించిన ఎన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. 
 
న్టీఆర్ కు హిందీ డబ్బింగు చెప్పిన యార్లగడ్డ పాత్రధారి ఎవరు అలాగే హిందీలో ఎన్టీఆర్ గా నటించిన ఉపేంద్ర పాత్రలో ఎవరు కనిపిస్తారు. ఇక ఎన్టీఆర్ కొడుకులైన బాలకృష్ణ, హరికృష్ణ లు గా ఎవరు నటిస్తారు అనేది అందరి ప్రశ్న. ఇకపోతే రానా దగ్గుబాటి ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో నటిస్తున్నాడు, అసలు ఈ సినిమా ఆ పాత్ర ఎలా చూపిస్తారు అని కూడా అందరూ ఎదురుచూస్తున్నారు.
 
ఇదిలా ఉంటే ఈ సినిమా కథ విషయంలో చంద్రబాబు నాయుడు ఇంవోల్వ్ అవుతున్నాడు అని తెలుస్తుంది. ముఖ్యంగా తన పాత్రకి సంభందించిన కొన్ని విషయాలని దగ్గరుండి మరి చూసుకుంటున్నాడు అని టాక్. వారాహి చలన చిత్రం పై సాయి కొర్రపాటి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.