నా కళ్ళ ముందే నా కూతురుని గదిలోకి రమ్మన్నాడు అని చెప్పిన సింగర్ తల్లి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

singer chinmayi
Updated:  2018-10-13 03:59:22

నా కళ్ళ ముందే నా కూతురుని గదిలోకి రమ్మన్నాడు అని చెప్పిన సింగర్ తల్లి

మీ టు ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచి ఆ ఉద్యమాన్ని జనాల్లోకి తిసుకేల్తుంది సింగర్ చిన్మయి. ఈ విషయంలో చిన్మయికి కొందరు మద్దతుగా ఉంటే మరికొందరు చిన్మయికి వ్యతిరేకంగా ఉన్నారు. చిన్మయి పై వస్తున్న విమర్శలపై చిన్మయి తల్లి పద్మాసిని కొన్ని కామెంట్స్ చేసింది. ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన చిన్మయి తల్లి పద్మాసిని చిన్మయికి జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది.

నేను చిన్మయి ఒక ఆడియో వేడుక కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాము. కార్యక్రమం పూర్తయ్యాక అంతా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. కానీ మమ్మల్ని కాసేపు వెయిట్ చేయమని అన్నారు. తర్వాత ఒక వ్యక్తి వచ్చి చిన్మయి కోసం వైరముత్తు ఎదురుచూస్తున్నాడు అని చెప్పాడు.

చిన్మయిని మాత్రమే గదిలోకి వెళ్ళమని చెప్పాడు. ఎందుకు ఇలా కలవమంటున్నాడు అని వైరముత్తుని అడిగితే, చిన్మయి కాస్త నాకు ఆ పని కోసం సహకరించాలి అని చెప్పాడు దాంతో మేము ఆ పనికి వేరే వారిని చూసుకోండి. మేము అలా కాదు అని అక్కడి నుంచి వచ్చేశామని పద్మాసిని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే వైరముత్తు ఎంత దిగజారాడు అని అర్ధం అవుతుంది. మరి చిన్మయి తల్లి ఇంత చెప్పాక కూడా జనాలు చిన్మయికి సపోర్ట్ ఇస్తారో లేదో చూడాలి.