"ఎన్టీఆర్" లో చిరు..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ntr bio pic and chiranjeevi
Updated:  2018-08-16 05:29:01

"ఎన్టీఆర్" లో చిరు..?

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారకరామారావు  జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న‌ చిత్రం "ఎన్టీఆర్‌".. క్రిష్‌ దర్శకత్వం  వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ "ఎన్టీఆర్" రోల్‌ లో నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా పోషిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో  అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, హెచ్‌.ఎం. రెడ్డి, చక్రపాణి, ఎస్వీఆర్‌, కృష్ణ, శ్రీదేవి తదితర పాత్రలు సినిమాలో ఉన్నట్లు తెలిసింది. కాగా "ఎన్టీఆర్" లో చిరు పాత్ర కుడా ఉందంటూ ఇప్పుడు ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి, గతంలో ఎన్టీఆర్‌, చిరంజీవి కలిసి "తిరుగులేని మనిషి" సినిమాలో నటించారు..అలానే వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం కూడా ఉంది.

ఈ మేరకు "ఎన్టీఆర్‌"లో చిరు పాత్ర ఉందా...ఉంటే ఆ పాత్రను వేసేదేవరు అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది,అయితే దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది ఇక ప్రస్తుతం "ఎన్టీఆర్‌"రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. 2019 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

షేర్ :