విజయ్ దేవరకొండ కి గట్టి సపోర్ట్ ఇస్తున్న మెగా స్టార్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

chiranjeevi and vijay devarakonda
Updated:  2018-08-08 11:26:21

విజయ్ దేవరకొండ కి గట్టి సపోర్ట్ ఇస్తున్న మెగా స్టార్

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం “గీత గోవిందం”. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పరుశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. గీత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతం అందించాడు.
 
ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఈ నెల ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 12వ తరీఖున వైజాగ్‌ లోని ఆర్ కె బీచ్ లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు...
 
ఇక ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాన్నునట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలకు మంచి స్పందన వస్తుండగా ఈ చిత్రానికి మంచి పాజిటివ్ మార్కెట్ నెలకొంది. మరి అందరి అంచనాలను "గీత గోవిందం" అందుకుంటుందో లేదో తెలియాలంటే ఆగస్ట్ 15 వరకు ఆగాల్సిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.