వాళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

megastar chiranjeevi
Updated:  2018-08-24 12:38:39

వాళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవి సాధారణంగా ఎప్పుడు కూల్ గా, ఆయన ఎప్పుడు ఎవరికీ పైకి సీరియస్ అవ్వరు. ఏ విషయాన్ని మాట్లాడిన గాని చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతారు చిరంజీవి. అయితే ఒక విషయంలో మాత్రం చిరంజీవి చాలా సీరియస్ అయ్యాడు, ఆ విషయమే “గీత గోవిందం” సినిమా లీక్. ఈ సినిమా లీక్ అయ్యింది అని అల్లు అరవింద్ చిరంజీవి దగ్గరకి వెళ్లి చెప్పాడు అంట.

అప్పుడు చిరంజీవి అల్లు అరవింద్ కి సపోర్ట్ గా నిలుస్తూ “అత్తారింటికి దారేది” కూడా లీక్ అయ్యింది కదా, కానీ సినిమా రిలీజ్ అయ్యాక పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మీ “గీత గోవిందం” కూడా అలాగే నిలుస్తుంది అని చెప్పాడు. కానీ చిరంజీవి ఆ తరువాత పబ్లిక్ గా ఈ లీక్ చేసిన వారికి అలాగే ఇండస్ట్రీ లో ఉన్న కొంత మందికి వార్నింగ్ ఇచ్చారు. అసలు ఒక సినిమాని ఎలా లీక్ చేస్తారు.

సినిమాని లీక్ చెయ్యడం అంటే కొన్ని కోట్ల కొల్లగోట్టినట్టే లెక్క. అసలు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఇండస్ట్రీ లో ఉండే వారికి ఇండస్ట్రీ చోటు ఇవ్వదు. అలంటి వాడు సొంత అమ్మ పాలు తాగి అమ్మ రొమ్మునే గుద్దినట్టు అవుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేసాడు చిరంజీవి. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.