మెగా అల్లుడికి కి క్లీన్ యు సర్టిఫికేట్ ఎందుకో తెలుసా.?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-07 18:53:50

మెగా అల్లుడికి కి క్లీన్ యు సర్టిఫికేట్ ఎందుకో తెలుసా.?

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు అయిన కళ్యాణ్ దేవ్ హీరోగా "విజేత" అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికి తెలిసిందే. రాకేశ్ శశి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటివలే సెన్సార్ కి వెళ్ళిన ఈ సినిమాకి క్లీన్ యు సర్టిఫికేట్ ని అందించారు సెన్సార్ సభ్యులు.
 
సినిమాకి అస్సలు సెన్సార్ కట్ కూడా చెప్పలేదు బోర్డు మెంబెర్స్.దాంతో ఈ సినిమాని ఈనెల 12న రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. మరి మెగా ఫ్యామిలీ నుంచి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న కళ్యాణ్ దేవ్ ప్రేక్షకులని ఎంత మేరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.
 
కామెడీ, ప్రేమ, తండ్రి-కొడుకుల సెంటిమెంట్ తో ఈ మూవీ ని తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ కి తండ్రిగా మురళి శర్మ నటించగా, "అర్జున్ రెడ్డి" ఫేం అయిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. కేకే సెంథిల్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాని వారాహి చాలని చిత్రం పై సాయి కొర్రపాటి గారు నిర్మించారు.

షేర్ :