ఓ ఇంటివాడు కాబోతున్న ప్రియ‌ద‌ర్శి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-21 04:51:03

ఓ ఇంటివాడు కాబోతున్న ప్రియ‌ద‌ర్శి

పెళ్లి చూపులు చిత్రంలో  హాస్య న‌టుడిగా న‌టించి 2016 లో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు యూత్ క‌మెడియ‌న్  ప్రియ‌ద‌ర్శి.... ఈ  సినిమాలో సైడ్ క్యారెక్ట‌ర్ లో త‌న దైన శైలిలో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక ఫేమ్ తెచ్చుకున్నఈ యంగ్ కమెడియ‌న్... ప్ర‌స్తుతం యువ హీరోల సినిమాల‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంటున్నాడు.
 
ఆయ‌న పాత్ర ఏదైనా కానీ న‌వ్వుల‌ను పువ్వుల రూపంలో పూయిస్తూ అభిమానుల చేత క్లాప్స్ కొట్టించుకుంటున్నాడు ద‌ర్శి. అయితే ఇప్ప‌టికే  ఎన్టీఆర్ న‌టించిన జైల‌వ‌కుశ‌, స్పైడ‌ర్ వంటి చిత్రాల్లో న‌టించాడు ప్రియ‌ద‌ర్శి..  తెలంగాణ‌ యాసలో ఇతను పలికిన  ప‌లుకులకు  తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు.
 
 
అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ప్రియద‌ర్శి రెండు రోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు... ఉత్త‌రాదికి చెందిన రిచా శ‌ర్మ‌ను ఈ నెల 23న వివాహం చేసుకోనున్నాడు ద‌ర్శి... ఈ వివాహం ఆగ్రాలో జ‌ర‌గ‌నుంది... సంప్ర‌దాయ బ‌ద్దంగా పెద్ద‌లు నిర్ణ‌యించిన ముహూర్తానికే 23వ తేది శుక్ర‌వారం రాత్రి 7 గంట‌ల‌కు ప్రియద‌ర్శి  రిచా శ‌ర్మ మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నాడు..  ఆ త‌ర్వాత 26న హైదరాబాద్‌లోని నరేన్ గార్డెన్స్‌లో రిసెప్షన్ భారీగా ఏర్పాటు చేశామ‌ని  ఈ విష‌యాన్ని ప్రియద‌ర్శి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.