ఆలీ సమంత ల స్నేహం లో పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan and samantha and ali
Updated:  2018-09-21 04:46:01

ఆలీ సమంత ల స్నేహం లో పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర

స్వభావ రీత్యా మహా సిగ్గరి అయినా పవన్ కళ్యాణ్ కెమెరా ముందు రెచ్చిపోతుంటారు. సహజత్వానికి దూరంగా ఉండే డాన్సులు, ఫైట్లు చెయ్యడం అతనికి పెద్దగా ఇష్టం ఉండదు. ఈయన సాధారణంగా ఎవ్వరికి దగ్గర అవ్వడు ఒకవేళ దగ్గర అయ్యాడు అంటే చాలా చనువుగా ఉంటాడు అనేది ఇండస్ట్రీ టాక్. ఆలీ తనపక్కన ఉంటె తనకి కొండంత అండ ఉంటుందని చాలా చెప్పాడు. తానే ఎవ్వరికి పరిచయం చేసుకొని పవన్ తాను వేరే వాళ్ళని ఇంకొక వ్యక్తికి పరిచయం చేసాడు అంటే కొంచెం నమ్మబుద్ది కానీ విషయమే.
 
అటువంటిది హీరోయిన్ సమంతను అలీకి పరిచయం చేసింది పవన్ కళ్యాణే అన్న విషయం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతా సమంత తనకి పరిచయమైనా విధానాన్ని అలీ చెప్పుకొచ్చాడు. 'సమంతను నాకు పరిచయం చేసింది పవన్ కళ్యాణే.పొల్లాచ్చిలో “అత్తారింటికి దారేది” సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంగా అలీ గారు....సమంత గారు మీకు పరిచయమేనా?' అని అడిగారు. లేదండీ అని సమాధానం చెప్పాను.
 
ప్పుడు ఆలిని, సమంతకి పవన్ పరిచయం చేస్తూ....'అలీగారని....బాగా రిచ్' అని సమంతకు చెబుతూ నన్ను పరిచయం చేశాడు అని ఆలీ చెప్పుకొచ్చాడు. నాకు అలిగారు అంటే ఎంతో ఇష్టం. సెట్లో ఆయన్ను చూడగానే నవ్వోచేది, అత్తారింటికి దారేది సినిమాలో ఆయనతో కలసి నటించాను. ఆ సినిమా షూటింగ్ అంతా ఓ పిక్ నిక్ లా అయిపోయింది. అయన పవన్ పై ఒక జోక్ వేస్తె....ఆయనపై పవన్ ఓ జోక్ వేసేవాడు. దాంతో సెట్లో నవ్వులే నవ్వులు. అంటూ సమంత వారి అనుభవాల్ని పంచుకుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.