పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు కాదు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-15 06:09:19

పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు కాదు

చిన్న చితక కామెడీలు చేస్కునే ఒక వ్యక్తి నిన్న సాక్షాత్తు మహేష్ బాబుకి అస్సలు యాక్టింగ్ రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. కాగా ఇప్పుడు మరో వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేసి ఫేమస్ అయిపోదాం అనే ప్రయత్నలలో ఉన్నాడు.  అతను ఇంకెవరో కాదు అప్పుడప్పుడు తెరమీద కనిపించే భరత్ రెడ్డి అనే క్యారక్టర్ ఆర్టిస్ట్.
 
భరత్ రెడ్డి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ జెన్యూన్ కాదని సంచలన వ్యాఖ్యలు చేసాడు.  ఆయన పవన్ కళ్యాణ్ తో కలిసి అత్తారింటికి దారేది చిత్రంలో నటించాడు. ప్రణీత కు జోడీగా నటించిన ఇతగాడు  అత్తారింటికి దారేది చిత్రం మాత్రమే కాకుండా దాదాపు 70 చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. 
అదే పనిగా పవన్ కళ్యాణ్ ని జనాలు వేలం వెర్రిగా పొగడటం చేస్తూ ఉంటారని అలాంటివి ఈయన గారికి నచ్చవట!. పవన్ కళ్యాణ్ ని పొగిడేవారంతా అయన దృష్టిలో పడాలనో లేదా ఫేమస్ అవ్వాలనో  చేస్తూ ఉంటారని అయన చెప్పుకొచ్చాడు. 
 
తానెప్పుడూ పవన్ కళ్యాణ్ ని అదే పనిగా పొగడలేదని, అయినా పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ నిజాలా ఏంటి అని వెటకారపు ధోరణిలో మాట్లాడడం పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించేలా ఉంది. 
ప్రస్తుతం ఇతను ఎన్టీఆర్ బయోపిక్ లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వేషం వేస్తున్నట్లు సమాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.