సునీల్ కావాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి మరి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sunil
Updated:  2018-08-25 03:42:27

సునీల్ కావాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి మరి

హాస్యంలో తనకంటూ ఒక ప్రత్యేకశైలిని ఏర్పరుచున్నసునీల్ సరదాగా చేసిన లీడ్ క్యారెక్టర్ తెచ్చిన విజయంతో హీరోగా అవతారం ఎత్తాడు. కొన్నాళ్లు బాగానే కొనసాగినా ఆ తర్వాత అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టేశాయి. చేసేదేంలేక మళ్ళి పాతదారిలోకి వద్దామని చాలా సార్లు అనుకున్నాకూడా సరైన సమయంకోసం చూశాడు.

దానికోసమే హీరోగా వస్తున్న పాత్రలకు నో చెప్పేసి కామెడీ పాత్రలకు సంతకాలు పెట్టేశాడు. తన చిరకాల మిత్రుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో వస్తున్న "అరవింద సమేత" శ్రీను వైట్ల రూపొందిస్తున్న "అమర్ అక్బర్ ఆంటోని" లాంటి భారీ సినిమాలతో పాటు "సిలీఫెల్లోస్" అనే చిన్న సినిమాలోనూ సునీల్ నవ్వించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అసలు సంగతి ఏంటంటే హీరో రెమ్యూనరేషన్స్ కి బాగా అలవాటు పడ్డ మన సునీల్ కామెడీ పాత్రలకు కూడా ఇంచుమించు అలాగే వసూలు చేస్తున్నాడని వినికిడి.

సినీవర్గాల సమాచారం ప్రకారం సునీల్ కామెడీ చేసినందుకు గాను రోజు కి మూడున్నర లక్షల రూపాయిలు పారితోషకం తీసుకుంటున్నాడంటా! మరీ ఈ స్థాయి లో పారితోషకం తీసుకుంటున్న కమెడియన్లు దాదాపుగా ఎవ్వరు లేరనే చెప్పాలి. ఈ దెబ్బతో కమెడియన్ గా సునీల్ మల్లి బిజీ అయిపోతాడు అని సినీవర్గాలు విశ్వసిస్తున్నాయి. ఏది ఏమైనా మన సునీల్ మళ్ళి కామెడీ చేసి మనల్ని ఫుల్ గా నవ్వించాలి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.