శృతిమించిన హాస్యం అపహాస్యం అయ్యిందా?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jabardasth show
Updated:  2018-09-08 04:40:00

శృతిమించిన హాస్యం అపహాస్యం అయ్యిందా?

తెలుగు రాష్ట్రాలలో రిమోట్ కోసం గొడవ లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి చూసే ఒకే ఒక్క కామెడీ షో ‘జబర్దస్త్’ అయితే ఈ ముధ్య కాలంలో ఈ షో కాస్త శృతిమించిందంటూ కొంతమంది అసంతృప్తి వెలి బుచ్చు తున్నారు. అవేమి మాకు పట్టవు అన్నట్టు ‘జబర్దస్త్’  యాజమాన్యం వ్యవరిస్తుంది. 
 
అప్పుడెప్పుడో పుట్టిన సుడిగాలి- రష్మీ మధ్య ఏదో నడుస్తుంది అంటూ పుకారు పుట్టించారు. అది చాలా కాలం చిలికి చిలికి తుఫాన్ లా మరి సామాజిక మాధ్యమాలలో ఒక పెద్ద చర్చ అయ్యింది. దానికి తోడు వాళ్ళకి పెళ్లంటూ ఏదో ప్రోగ్రాం కూడా చేసారు ఈటీవీ యాజమాన్యం. ఇప్పుడు మరో జంట వాళ్ళను చూసి పుట్టుకొస్తున్నట్టు కనిపిస్తుంది. హైపర్ ఆది- అనసూయలు కూడా ఇదే కోవలోకి వస్తారా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
 
దానికి కారణం వారి మధ్య జరిగే డాన్సులు మరియు సంభాషణలు. స్వర్గాన్ని చూడాలంటే.. అనసూయను హగ్ చేసుకుంటే చాలు అని చెప్పడమే కాకుండా.. ఏకంగా సీట్లో కూర్చున్న అనసూయ వచ్చి హైపర్ ఆదిని హగ్ చేసుకోవడం.  ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఒక పెళ్ళైనా యువతీ ఇలా చెయ్యడం మాములు మధ్య తరగతి మహిళలకు పెద్దగా నచ్చదు. 
 
వీళ్ళ వ్యవహారం కాస్త ముదిరినట్టు కనిపిస్తుంది తాజాగా వచ్చిన ట్రైలర్ చూస్తుంటే. అనసూయకు, నాకు మధ్య ఏముంది..? అంటూ అడిగిన హైపర్ ఆది.. మా మధ్య ఏముంది..! ఆరడుగు దూరం ఉంది. ఇది చదివినప్పుడు ఎలా ఉన్నా చూసినప్పుడు మాత్రం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు మధ్య తరగతి మహిళలు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.