బిగ్‌బాస్‌లోకి సామాన్యుడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bigg boss 2
Updated:  2018-07-23 17:43:31

బిగ్‌బాస్‌లోకి సామాన్యుడు

అసలు "బిగ్ బాస్" చరిత్రలోనే ఎప్పుడు తీసుకొని నిర్ణయం ఇప్పుడు "బిగ్ బాస్ 2" కోసం తీసుకున్నారు. అదేంటంటే ఇప్పటి వరకు హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయిన సభ్యుల్ని మళ్ళి వోటింగ్ పద్ధతి లో ప్రజలు ఎన్నుకొని హౌస్ లోకి తీసుకొని రావొచ్చు. అయితే ఈ ప్రక్రియలో చాలా మంది నూతన్ నాయుడు కి పాజిటివ్ గా ఉన్నారు. ఈ విషయం పైనే నూతన్ నాయుడు మాట్లాడుతూ, "ఓటు మీది - గెలుపు నాది..! కోట్లాది బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నూతన్ నాయుడిగా ఉన్న నన్ను బిగ్ బాస్ నూతన్ నాయుడిగా చేసిన మీకూ, బిగ్ బాస్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమాభిమానాలతో బిగ్ బాస్ లో రెండు వారాలు ఉన్నాను.

హౌస్ లో ఉన్నప్పుడూ, బయటకు వచ్చిన తరువాత కూడా మీరు చూపించిన ఆదరణ, అభిమానం జీవితంలో ఎప్పుడూ మరచిపోలేను. అడక్కుండానే ఇంత గుర్తింపు ఇచ్చిన బిగ్ బాస్ ఇంకో అవకాశం ఇస్తున్నారు. ఇంతకుముందు ఎలిమినేట్ అయిన వారిలో ఒకరిని మళ్ళీ హౌస్ లోకి తీసుకు రావాలనేది బిగ్ బాస్ ఆలోచన. మీరు వేసే ఓట్ల ఆధారంగా నేను, భాను, శ్యామలలో ఎవరో ఒకరికి హౌస్ లో అడుగుపెట్టే అవకాశం దొరుకుతుంది. రెండో వారంలోనే బయటకు వచ్చేయటం వల్ల మిమ్మల్ని పూర్తిగా అలరించే అవకాశం, నన్ను నేను ఆవిష్కరించుకునే అవకాశం నాకు దొరకలేదు.

ఈ సారి అవకాశం దొరికితే నా శక్తి సామర్ధ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అనుకుంటున్నాను. దానికి మీ ఆదరణ కావాలి. మీ ఆశీస్సులు కావాలి. మీ కొండంత మద్దతు కావాలి. మీరంతా నావెంటే ఉన్నారని, ఉంటారని నా నమ్మకం. మరోసారి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే అవకాశాన్ని, మిమ్మల్ని మెప్పించగలిగే అదృష్టాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. మీ ఓటు  రాతల్ని, తలరాతల్నీ మారుస్తుంది. కొత్త చరిత్రల్ని సృష్టిస్తుంది. కొత్త అధ్యాయాల్ని లిఖిస్తుంది. మీ ఓటు నన్ను గెలిపిస్తుందని, నడిపిస్తుందని నా నమ్మకం. ఆట నాది అభిమానం మీది. నా గెలుపైనా ఓటమైనా అదెప్పుడూ మీదే. మీ నిర్ణయమే నాకు శిరోధార్యం. ఎప్పటికీ...మీ నూతన్ నాయుడు" అని బుల్లి తెర ప్రేక్షకుల్ని కోరాడు నూతన్ నాయుడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.