మీడియాపై రానా సీరియ‌స్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

daggubati rana
Updated:  2018-06-25 01:52:53

మీడియాపై రానా సీరియ‌స్

ద‌గ్గుబాటి వార‌సుడు రానా బ‌ళ్లాల‌దేవునిగా మంచి పేరు తెచ్చుకున్నారు బాహుబ‌లి చిత్రం ద్వారా ఇక.. నేనే రాజునేనే  మంత్రి, ఘాజీ సినిమాతో మ‌రింత పాపుల‌ర్ అయ్యారు..  ఇటీవ‌ల శ్రీరెడ్డి వ్యాఖ్య‌ల‌తో కాస్త ద‌గ్గుబాటి ఫ్యామిలీ మీడియాకి దూరంగా ఉన్నా,మ‌ళ్లీ కాస్త మీడియా ముందుకు సినీ  ఇండ‌స్ట్రీలో యాక్టీవ్ అయ్యారు ద‌గ్గుబాటి ఫ్యామిలీ.. ఇక గ‌తంలో రానా సినిమా షూటింగ్ ల స‌మ‌యంలో  కాస్త అస్వ‌స్ద‌త‌కు లోన‌య్యార‌ని వార్త‌లు వినిపించాయి.. ఇటు బాహుబ‌లి సినిమా షూటింగ్ స‌మ‌యంలో కూడా రానా పై ప‌లు వ‌దంతులు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
 
అయితే ఇప్పుడు మ‌ళ్లీ రానా ఆరోగ్యం పై నెగిటీవ్ ట్రోల్ మొద‌లైంద‌ట‌.. కొన్ని మీడియాలు కావాల‌నే త‌న‌పై ఇలాంటి అస్య‌త వార్త‌లు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డుతున్నారు..అస‌లు మా ఆరోగ్యాల‌పై మాకు లేని శ్ర‌ద్ద మీకు ఏమిటి అని ప్ర‌శ్నిస్తున్నారు.. తాము ఆరోగ్యంగా ఉన్నా వ‌దంతులు సృష్టిస్తున్నార‌ని ఇలాంటి వార్త‌లు ప్ర‌చురించే ముందు, జ‌నాల‌కు తెలియ‌చేసేముందు వాస్త‌వాలు తెలుసుకోవాల‌ని ఆయ‌న మండిప‌డ్డారు.. అన్నీ మీడియాలు కాద‌ని ప‌లు మీడియాలు కావాల‌నే చేస్తున్నాయని ఆయ‌న ఫైర్ అయ్యారు.
 
రానా ఇంత మండిప‌డ‌టానికి కార‌ణం కూడా ఉంది.. రానా గ‌త రెండు నెల‌లుగా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ని మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళుతున్నారు అని కొంద‌రు వార్త‌లు ప్ర‌చురించారు.. త‌న‌కు ఎటువంటి అనారోగ్యం లేద‌ని ఇలాంటి ఫేక్ వార్త‌లు ఆపాల‌ని ఆయ‌న కోరారు. అయితే కిడ్నీ శ‌స్త్ర‌చికిత్స ఎలా ఉన్నా రానాకి కంటి స‌మ‌స్య ఉన్న విష‌యం తెలిసిందే.. అందుకే కంటికి శ‌స్త్ర‌ చికిత్స చేయించుకోనున్నార‌ట‌.. మ‌రో నెల‌లో రానా కంటి చికిత్స జరుగుతుంద‌ని సురేష్ బాబే వెల్ల‌డించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.