శేఖ‌ర్ మాస్ట‌ర్ భార్య రేష్మీకి వార్నింగ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-17 06:44:03

శేఖ‌ర్ మాస్ట‌ర్ భార్య రేష్మీకి వార్నింగ్

ఓ ప్ర‌ముఖ‌ ఛాన‌ల్ లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ షో మ‌రియు డీ డాన్స్ ప్రోగ్రామ్  ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు  ఎంతో ద‌గ్గ‌ర‌య్యారు  రేష్మీ గౌత‌మ్... ఈ షోలో త‌న డ్ర‌స్సింగ్ స్టైల్ తో యూత్ ను  క‌ళ్లార్ప‌కుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ‌....  బుల్లితెరలో ప్ర‌సార‌మ‌య్యే  వివిధ ప‌లు  ప్రోగ్రామ్ ల‌లో పాల్గొని, వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటూ  ఫీమేల్ యాంక‌రింగ్ లో అగ్ర స్ధానంలో   కొన‌సాగుతున్నారు ర‌ష్మీ.. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ బుల్లి తెర‌లోనే కాకుండా వెండితెర‌లో కూడా ప‌లు చిత్రాల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.
 
అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం శేఖ‌ర్ మాస్ట‌ర్ భార్య  రేష్మీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది... ఢీ  డాన్స్ షోలో ప్ర‌ముఖ ఛాన‌ల్ యాజ‌మాన్యం పాత జ‌డ్జీల‌ను తొల‌గించి కొత్త‌వారిని నియ‌మించి  ఈ షోను ర‌న్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే... ఈ షోలో యాంక‌ర్స్ చేత జ‌డ్జీలు కామెంట్స్ చేయించ‌డంతో తాజాగా మ‌రో వివాదం చెల‌రేగిన‌ట్లు తెలుస్తోంది..
 
 శేఖ‌ర్ మాస్ట‌ర్, యాంక‌ర్ రేష్మీ గౌత‌మ్ డీ షో ప్రోగ్రామ్ మ‌ధ్య‌లో ఒక‌రికొక‌రు ఫ‌న్నీగా ల‌వ్ ప్ర‌పోజ్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే... అయితే ఈ ఫ‌న్నీ ప్ర‌పోజులు వ్య‌వ‌హారం కాస్తా సీరియ‌స్ గా మారుతోన్న‌ట్లు తెలుస్తోంది... ఈ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియా పుణ్య‌మా అంటూ  చివ‌రికి శేఖ‌ర్ మాస్ట‌ర్ భార్య‌కు తెలిసిందట‌.. 
 
దీంతో తన భర్త అలా టీవీలో రేష్మీ తో రోమాన్స్ చేయడం చూసి తట్టుకోలేని ఆమె  రేష్మీకి వార్నింగ్ ఇచ్చినట్టు కొన్ని యుట్యూబ్ చానల్స్ లో వార్త‌లు వ‌స్తున్నాయి.. కాగా ఇప్ప‌టికే జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ సుడిగాలి సుధీర్ తో ర‌ష్మీ ల‌వ్ లో ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.