డయానా సినీ రాజ్యం ఏలుతుందా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

dayana
Updated:  2018-09-12 01:30:47

డయానా సినీ రాజ్యం ఏలుతుందా..?

మణిరత్నం తెలియని పేరేమి కాదు. రోజా, బాబాయ్, నాయక్, గీతాంజలి లాంటి ఎన్నో మధురమైన చిత్రాలకు దర్శకుడు ఆయన. దర్శకత్వంలో ప్రతీ స్థాయిని స్పృశించిన మనిషతను. ఇప్పుడు ‘నవాబ్’ అనే చిత్రాన్ని  అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ లు ప్రధాన పాత్రలు గా తీస్తున్నారు.

ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లుగా  అదితి రావు హైదరి ,ఐశ్వర్య రాజేష్ ,డయానా లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించి, సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సినిమా లో మొదటి సారి హీరోయిన్ గా పరిచయమవుతున్న డయానా సినిమా పై మంచి హోప్స్ పెట్టుకుంది. మామూలుగా అయితే చాలా మంది హీరోయిన్స్ ఆయనతో ఒక్క అవకాశం వచ్చినా చాలనుకుంటారు. కొత్తవాళ్ళైతే తమ దశ మారిపోతుంది అనే ఇది లో ఉంటారు. అటు ఇటు కాకుండా పోయునోళ్లు కూడా ఉన్నారు. మరి ఈ డయానా బేబీ ఎటు పొద్దో చూడాలి మరి.

షేర్ :