నవాబ్ చిత్రంపై ఆశలు పెట్టుకున్న డయానా..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

dayana
Updated:  2018-09-11 15:30:55

నవాబ్ చిత్రంపై ఆశలు పెట్టుకున్న డయానా..

గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న అగ్రదర్శకుడు మణిరత్నం మరోసారి నవాబు రూపంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ లు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం భారీ తారాగణంతో రూపొందించగా తమిళంలో చెక్క చివంతా వానం అనే పేరుతో విడుదల అవుతున్నది ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లుగా అదితి రావు హైదరి,ఐశ్వర్య రాజేష్,డయానా లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు..

navab

new movie

ఇటీవలే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమా ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా  సెప్టెంబర్ 27 న రిలీజ్ అవుతుంది..ఎమోషనల్, యాక్షన్ అంశాలను మేలవించి ఈ చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. 

simbu

manisharma

కాగా ఈ సినిమా లో హీరోయిన్ గా పరిచయమవుతున్న డయానా సినిమా పై మంచి హోప్స్ పెట్టుకుంది.. ఈ సినిమా తో గ్రాండ్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి ఆఫర్స్ దక్కించుకునే ప్రయత్నంలో ఉంది.. ఇప్పటికే లుక్ లో సూపర్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ నటన లోనూ పర్వాలేదు అనిపించుకుంటే టాలీవుడ్ ను ఎలేస్తుంది మరీ..