ఒకప్పుడు సందడి చేసిన భామ, బామ్మ వయసులో కూడా పిచ్చెక్కిస్తోంది..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

deepthi bhatnakar
Updated:  2018-09-25 12:34:33

ఒకప్పుడు సందడి చేసిన భామ, బామ్మ వయసులో కూడా పిచ్చెక్కిస్తోంది..

అప్పుడెప్పుడో వచ్చిన “పెళ్లి సందడి” చిత్రం గుర్తుండే ఉంటుంది. ఒక వేళా ఆ చిత్రం గుర్తులేకపోయినా.. “సౌందర్యాలహరి స్వప్న సుందరి నీవే నా ఊపిరి” అనే పాటలో ముసుగేసుకున్న బొడ్డులో తాళం గుత్తి ఉండే ఆ రూపం ఇంకా మెదడులో మెదులుతూ ఉంటుంది. దానికి కారణం ఒకటి ఆ పాత్రని సృష్టించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అయితే రెండవది అంత అందాన్ని తన ఒంటిమీద నింపుకున్న దీప్తి భట్నాకర్.

ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా అమ్మాయిగానే ఉందంటే నమ్మగలరా.. ? కానీ ఆమె తన సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసే చిత్రాలు చూస్తే ఈమె ఇంకా కన్యే నెమో అనే అనుమానం కలుగుద్ది. అనుకోకుండా దీప్తిని ఎవరైనా చూస్తే ఆమెకు 50 ఏళ్ల వయసు అని అస్సలు ఊహించలేరు. ఆమెని  ఫోటోలలో చూసిన వారంతా ఆశ్చర్య పోతున్నారు. ప్రస్తుతం 30 ఏళ్లకే హీరోయిన్ల వయసు మీద పడ్డట్లు తెలిసిపోతోంది. కానీ ఈ వయసులో కూడా చెక్కు చెదరని సౌందర్యంతో ఉండడం ఈమెకే చెల్లిందని చెప్పొచ్చు.పెళ్లి సందడి చిత్రం తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి ఈ భామకి అయితే 2004 లోనే పెళ్లి పీఠలెక్కి అప్పటి యువత గుండెల్ని గాయపరిచింది.

కానీ ఈ సుందరి సినిమాలకు మాత్రమే దూరమైనది కానీ అభిమానులకు కాదు. సోషల్ మీడియాలో తన ప్రతి వెకేషన్ కి సంబందించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఈ ఫొటోలే ప్రస్తుతం నెటిజన్లలో హాట్ టాపిక్ గా మారాయి. 50 ఏళ్ల వయసులో కూడా మోడరన్ దుస్తుల్లో అదరగొడుతోంది. ఆమె అందానికి అంతా ఫిదా అవుతున్నారు. బికినిలో మెరిసిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.