ఫిజికల్ టాస్క్ లలో కొంచెం జాగ్రత్త: దీప్తి భర్త

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

deepthi nallamothu
Updated:  2018-09-12 05:14:50

ఫిజికల్ టాస్క్ లలో కొంచెం జాగ్రత్త: దీప్తి భర్త

బిగ్ బాస్ తెలుగు టీవీ షో మీద రోజు రోజుకి కంప్లైంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. తనీష్ ప్రవర్తన మీద రోజు రోజుకి దీప్తి నల్లోమోతు అసంతృప్తి పెరిగిపోతుంది.కానీ ఏమీ ఎనలేని పరిస్థితి. బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాని అతడి మీద సాఫ్ట్‌ కార్నర్‌ చూపించి తగిన విధంగా గడ్డి పెట్టడం లేదనే కంప్లయింట్‌ కూడా వుంది. అయితే రిలేషన్స్‌కి వేల్యూ ఇస్తానని, టాస్క్‌లలో అలా ఆడక తప్పడం లేదని తనీష్‌ చెప్తున్నాడు.
 
ఫిజికల్ గా దాడి చేయడమే కాకుండా పదే పదే దీప్తిని నామినేట్‌ చేసాడు తనీష్‌. కౌశల్ ఒక సారి గట్టిగా ఈ విషయం మీద నిలదీస్తే నీళ్లు నమలడం మొదలెట్టాడు.ఈలోగా సామ్రాట్‌ తల్లి వచ్చి అమ్మ గురించి భలే మాట్లాడతావయ్యా అంటూ కౌశల్‌ని ప్రశంసించడంతో ఇంకా హీరో అయిపోయాడు. ఇక టీవీ9 దీప్తి భర్త అయితే వెళుతూ వెళుతూ 'ఫిజికల్‌ టాస్క్‌లు ఆడేటప్పుడు కొంచెం చూసుకోండి' అని ఒక చురక వేసి పోయాడు. 
 
దాంతో అదంతా బయటకి కనిపించేసిందా అనుకుంటూ తనీష్‌ వెంటనే స్మోకింగ్‌ రూమ్‌లో దూరి బాధ పడిపోవడం మొదలు పెట్టాడు. సామ్రాట్‌ వచ్చి 'భర్త కదా. ఆమాత్రం వుంటుంది' అంటూ సవరించడానికి చూసాడు.

షేర్ :