హ‌ఠాత్తుగా బిగ్ బాస్ హౌస్ నుంచి దీప్తీ ఎలిమినేటెడ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

deepthi nallamothu
Updated:  2018-09-27 02:59:49

హ‌ఠాత్తుగా బిగ్ బాస్ హౌస్ నుంచి దీప్తీ ఎలిమినేటెడ్

బుల్లితెరలో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న బిగ్ బాస్ సీజ‌న్ 2 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హౌస్ లో లో కౌశ‌ల్, త‌నీష్, దీప్తీ, గీతామాధురి, సామ్రాట్ ఉన్నారు. ఈ వారంలో వీరిలో విజేత‌లు ఎవ‌రో తేలిపోతుంది. ఈ స‌మ‌యంలో బిగ్ బాస్ హౌస్ ఏమైనా జ‌రుగ‌వ‌చ్చు. అయితే ఇప్ప‌టికే ఎలిమినేటెడ్ ప్రక్రియ‌ద్వారా  14 మందిని హౌస్ నుంచి పంపించారు. 
 
ఇక‌ మిగిలిన 5 మందితో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలెకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ క్ర‌మంలో శ‌ని లేక ఆదివారాల్లో ఎలిమినేటెడ్ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. కానీ హ‌ఠాత్తుగా టీవీ9 యాంక‌ర్ దీప్తీ న‌ల్ల‌మోతుల హౌస్ నుంచి తొల‌గించిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అదేంటి ప్ర‌తీ శని, ఆదివారాల్లో క‌దా ఎలిమినేటెడ్ ప్ర‌క్రియ జ‌రిగేది మ‌ధ్య‌లో ఎలిమినేష‌న్ ఎలా చేస్తారని అనుకుంటున్నారా! 
 
తాజాగా ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌ను చెప‌ట్టాల‌ని నిర్ణ‌యించింద‌ట. అందులో దీప్తీ న‌ల్ల‌మోతుల పేరు ఉండ‌టంతో ఆమెను హ‌స్ నుంచి బ‌య‌ట‌కు పంపించాల‌ని ప్లాన్ వేశార‌ట‌. ఆ విధంగా గ్రాండ్ ఫినాలేలో న‌లుగురు మాత్ర‌మే పోటీ ప‌డెలా బిగ్ బాస్ నిర్ణ‌యించార‌ని స‌మాచారం. ఇటీవ‌లే పేర్కొన్న ఫేస్ ముక్ ఆధారంగా దీప్తీ ఓటింగ్ ను నిర్ణ‌యించి ఆమెను ఎలిమినేటెడ్ చేయ్యాల‌ని బిగ్ బాస్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.