బాహుబలి" ని డైరెక్ట్ చేయనున్న దేవకట్ట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

deva katta
Updated:  2018-07-06 18:21:55

బాహుబలి" ని డైరెక్ట్ చేయనున్న దేవకట్ట

ఇండియన్ సినిమా చరిత్రలో "బాహుబలి" లాంటి సినిమా ఏ రేంజ్ ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కి ఇప్పుడు ప్రిక్వెల్ రానుంది, కాని ఈ ప్రిక్వెల్ సినిమా రూపం లో కాకుండా వెబ్ సిరీస్ రూపంలో రానుంది.

ఈ వెబ్ సిరీస్ లో శివగామి రాణి ఎలా అయ్యింది, అసలు కట్టప్ప మాహిష్మతి రాజ్యానికి కాపలాగా ఎందుకు ఉంటాడు అనే విషయాలు ప్రస్తావిస్తారు అంట దర్శకులు. అయితే ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసే బాధ్యతలు రాజమౌళి దేవకట్టకి అప్పజెప్పాడు అని తెలుస్తుంది. అసలైతే ఈ వెబ్ సిరీస్ ని రాజమౌళి ఏ డైరెక్ట్ చేయాలి. కాని ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

అందుకే ఈ వెబ్ సిరీస్ యొక్క దర్శకత్వ బాధ్యతలని దేవకట్టకి ఇచ్చాడు రాజమౌళి. నెట్ ఫ్లిక్స్ వారు ఈ వెబ్ సిరీస్ ని గ్రాండ్ లెవెల్ లో ప్రొడ్యూస్ చేయనున్నారు. ప్రస్తుతం దేవకట్ట బాలీవుడ్ లో సంజయ్ దత్ తో తెలుగు "ప్రస్థానం" సినిమాని రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే వెబ్ సిరీస్ పై దృష్టి సారిస్తాడు దేవకట్ట.

షేర్ :