నాగార్జున నాని ఇద్దరూ వస్తున్నారు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nagarjuna and nani
Updated:  2018-08-06 12:07:04

నాగార్జున నాని ఇద్దరూ వస్తున్నారు

కింగ్ నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని కలిసి నటిస్తున్న చిత్రం "దేవదాస్". "శమంతకమణి" ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిరిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా ఉన్న ఈ చిత్రంలో నాగ్ సరసన "మళ్ళిరావా"ఫేమ్ ఆకాంక్ష సింగ్, నాని సరసన "ఛలో"ఫేమ్ రష్మిక మందన్న నటిస్తోంది. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఈ నెల 7వ తారీఖు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇక ఈ చిత్రంలో నాగ్ డాన్ రోల్ చేస్తుండగా నాని డాక్టర్ గా కనిపిస్తున్నాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం వినోదాబరితంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న వినాయక చవితి కానుకగా విడుదల చేయనున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.