ఇలాంటి అవార్డులు కూడా ఉంటాయా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bollywood heroines
Updated:  2018-10-04 01:22:24

ఇలాంటి అవార్డులు కూడా ఉంటాయా..?

సినిమా ఇండస్ట్రీ లో ఆర్టిస్ట్ లు కి కొదవ లేనట్టు ఈవెంట్స్ కి, అవార్డ్స్ కి కూడా కొరత లేదు.. ఎప్పుడు ఏదొక ఫంక్షన్, ఏదొక అవార్డ్స్ సినిమా వాళ్ళకి వస్తూనే ఉంటాయి.. సినిమా వాళ్లకి ఇచ్చే అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టరస్ , అవి కాకుండా  డిజైరబుల్ మ్యాన్ అని డిజైరబుల్ వుమన్ అని కూడా ఉంటాయి..  అంతే కాకుండా బాలీవుడ్ లో ఏడాది లో చెత్త గా నటించిన వాళ్ళకి "గోల్డెన్ కెలా అవార్డ్స్" అని ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది..

ఈ అవార్డ్స్, సెలబ్రిటీ టాగ్స్ గోల ఇప్పుడేందుకంటే..? ఈ సంవత్సరం లో ఇలియానా గెలుచుకున్న అవార్డ్ అటువంటిది మరి. ఈ సంవత్సరం ''మోస్ట్ సెన్సేషనల్ సెలెబ్రిటీ" టాగ్ ను ఇల్లీ బేబీ కైవశం చేసుకుంది.  ఈ అవార్డ్ ప్రత్యేకత ఏమిటంటే?  ఏ సెలబ్రిటీ పేరు.. ఫోటో పెడితే మీరు లింక్ క్లిక్ చేసి హ్యాకర్ల బుట్టలో పడతారో.. మీ డేటా పోగొట్టుకొని చేతులు కాల్చుకుంటారో ఆ సెలబ్రిటీలన్నమాట.. తమ పన్నెండో ఎడిషన్ 'మెక్ అఫీ మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ' సర్వే రిజల్ట్ ను టెక్నాలజీ కంపెనీ మెక్ అఫీ వారు తాజా గా ప్రకటించారు.

ఈ సర్వేలో ఇలియానా మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో వరుసగా ప్రియాంక చోప్రా.. దీపిక పదుకొనే.. ప్రీతీ జింటా.. టబు.. కృతి సనన్.. అక్షయ్ కుమార్.. రిషి కపూర్.. పరిణీతి చోప్రా.. గోవిందా లు ఉన్నారు.. గత ఏడాది అయితే ఈ స్థానం స్టార్ కమెడియన్ కపిల్ శర్మ నిలిచాడు.. కాబట్టి వచ్చే ఆన్లైన్ లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండడం మంచిది, లేదంటే మీ డేటా ని ఇలాంటి లింక్ లు ఏరా గా వేసి దోచుకుపోతారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కన్నా, చేతులు కాలకుండ చూసుకోవడం మంచిది కాదా...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.