ఫ్లాప్ డైరెక్టర్ కి మళ్ళి అవకాశం ఇచ్చిన దిల్ రాజు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

dil raju
Updated:  2018-08-16 03:27:47

ఫ్లాప్ డైరెక్టర్ కి మళ్ళి అవకాశం ఇచ్చిన దిల్ రాజు

"శ్రీనివాస కళ్యాణం" సినిమాతో ఇటివలే ఫ్లాప్ ని అందుకున్నాడు దిల్ రాజు. "శతమానం భవతి" సినిమాతో ఆకట్టుకున్న సతీష్ వేగ్నేశ ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేసాడు. కానీ దర్శకుడు సతీష్ వేగేశ్న ఆశించిన స్థాయిలో ఈ సినిమాతో మెప్పించలేకపోయాడు. దాంతో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది.
 
"శ్రీనివాస కళ్యాణం" ఫ్లాప్ అయినా కూడా దిల్ రాజు, సతీష్ వేగేశ్నల కాంబినేషన్లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈమధ్య ఒక రచయిత నిర్మాత దిల్ రాజుకు కథను చెప్పడం జరిగింది. ఈ కథ నచ్చిన వెంటనే దిల్ రాజు సతీష్ వేగ్నేశ ని పిలిచి ఈ సినిమాని నువ్వే డైరెక్ట్ చేయాలి అని చెప్పాడు అంట.
 
ఈ కథకు "థాంక్యు" అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా దిల్ రాజు ప్రకటించాడు. "థాంక్యు" కు ట్యాగ్ లైన్ మీకు ఎలా చెప్పాలో అని అనుకున్నాడు అంట దిల్ రాజు. ఈ సినిమా షూటింగ్ ని త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని దిల్ రాజు భావిస్తున్నాడు.

షేర్ :