దిల్ రాజుకి పొంచి ఉన్న విజయ్ గండం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda and dil raju
Updated:  2018-09-21 03:09:48

దిల్ రాజుకి పొంచి ఉన్న విజయ్ గండం

“గీతగోవిందం” విజయ దేవరకొండకి ఏ విధంగా కెరీర్లో మర్చిపోలేని విజయాన్ని అందించి అతనికి గుర్తుండిపోతుందో..అదేవిధంగా దిల్ రాజుకి కూడా మర్చిపోలేని సినిమా అయ్యింది. అదేంటి.. గీత గోవిందంకి  దిల్ రాజుకి సంబంధం ఏముంది అనుకుంటున్నారా..?  ఉంది!  ఆగస్టు 9న రిలీజ్ అయిన “శ్రీనివాస కళ్యాణం” అటుఇటు గా ఆడుతున్న సమయంలో ఆగస్టు 15న “గీతగోవిందం” వచ్చి చాలా పెద్దనష్టమే చేసింది.
 
యావరేజ్ టాక్ తో నడుస్తున్న చిత్రాన్ని కాస్త డిజాస్టర్ చేసిపడేసింది. ఇప్పుడు మరోసారి దిల్ రాజుని దెబ్బ తియ్యడానికి విజయ్ సన్నద్దమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు కి విజయ్ గండం పొంచి ఉంది. దిల్ రాజు నిర్మించిన హలో గురూ ప్రేమకోసమే చిత్రం అక్టోబర్ 18న విడుదలకు ముస్తాబయింది. విజయ్ దేవరకొండ సినిమా నోటా కూడా రిలీజ్ కి సిద్ధమైంది.
 
మాములుగా అక్టోబర్ 4వ తేదికి విడుదల కావాల్సిన “నోటా”  పలు సాంకేతిక కారణాల వాళ్ళ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ‘నోటా’ ‘హలో గురు ప్రేమకోసమే’ ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే మల్లి దిల్ రాజుకి నష్టం తప్పకవచ్చు. విజయ్ కి ఫ్యాన్ బేస్ బాగా పెరగడం వల్ల బడా నిర్మాతలు సైతం భయపడాల్సి వస్తుంది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.