ఆ డైరెక్టర్ మీద కోపంగా ఉన్న దిల్ రాజు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

dil raju
Updated:  2018-08-27 03:15:17

ఆ డైరెక్టర్ మీద కోపంగా ఉన్న దిల్ రాజు

దిల్ రాజు ఎంత కూల్ మనిషి అనేది మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి దిల్ రాజు ఇటివలే ఒక దర్శకుడి పియా సీరియస్ అయ్యాడు అంట. ఇంతకి అసలు విషయం లోకి వెళ్తే దిల్ రాజు ప్రస్తుతం రామ్ ని హీరోగా పెట్టి "హలో గురు ప్రేమకోసమే" అనే సినిమా తెరకేక్కిస్తున్నాడు.

ఈ సినిమాని "నేను లోకల్" ఫేం త్రినాద్ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటివలే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ చూసిన దిల్ రాజు సినిమా దర్శకుడు త్రినాద్ రావు నక్కిన పై సీరియస్ అయ్యాడు అని అంట. సీరియస్ అవ్వడమే కాకుండా మళ్ళి వెంటనే ఆ సీన్స్ అన్నింటిని రీ షూట్ చేయాలి అని త్రినాద్ రావు కి చెప్పాడు అంట.

ప్రస్తుతం త్రినాద్ రావు ఆ పనిలో ఉన్నాడు అని తెలిసింది. ఇదిలా ఉంటే దిల్ రాజుకి ఈ ఏడాది "లవర్" "శ్రీనివాస కళ్యాణం" సినిమాలతో గట్టి దెబ్బలు తగిలాయి. అందుకే తన తదుపరి సినిమా అయిన "హలో గురు ప్రేమ కోసమే" ఎలాగైనా హిట్ అవ్వాలి అనే కసితో దిల్ రాజు ఇలా చేస్తున్నాడు అని టాక్.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.