బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న దిల్ రాజు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

dil raju
Updated:  2018-07-28 12:00:56

బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న దిల్ రాజు

స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా "శ్రీనివాస కళ్యాణం". నితిన్ ఇంకా రాశి ఖాన్న జంటగా నటించిన ఈ సినిమాని "శతమానంభవతి" ఫేం అయిన సతీష్ వేగ్నేష్ డైరెక్ట్ చేసాడు. అయితే ఈ సినిమా వచ్చే నెల ఆగష్టు 9 నుంచి ధియేటర్స్ లో సందడి చేయనుంది.

12 ఏళ్ల క్రితం అదే రోజున బొమ్మరిల్లు రిలీజ్ అయ్యియా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్ళి ఇదే బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ దిల్ రాజు ఈ సినిమాని కూడా ఆగష్టు 9 న రిలీజ్ చేస్తున్నాడు. "బొమ్మరిల్లు" "శతమానం భవతి" వంటి సినిమాల తరువాత కుటుంబ కథ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి "శ్రీనివాస కళ్యాణం" పై అందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి.

ఆ సినిమాల కంటే కూడా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ప్రేక్షకుడు కొత్త అనుభూతితో బయటకు వస్తారని చెప్పాడు దిల్ రాజు. ఇకపోతే దిల్ రాజు కెరీర్ లో ఫ్యామిలీ హిట్స్ చాలానే ఉన్నాయి. ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది అని ఆశిద్దాం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.