హరీష్ శంకర్ తో సినిమా కాన్సిల్ చేసిన దిల్ రాజు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

dil raju and harish shankar
Updated:  2018-07-18 05:26:53

హరీష్ శంకర్ తో సినిమా కాన్సిల్ చేసిన దిల్ రాజు

దిల్ రాజు ఇంకా హరీష్ శంకర్ ఇద్దరి మధ్య ఎంత మంచి అనుభందం ఉంది అనేది ఇండస్ట్రీ మొత్తం తెలుసు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్" అలాగే "దువ్వాడ జగన్నాధం" వంటి మూవీస్ వచ్చాయి. అయితే మల్లి వీళ్ళ కాంబినేషన్ లో త్వరలో "దాగుడు మూతలు" అనే మల్టీ స్టారర్ రాబోతుంది అనే వార్తలు వచ్చాయి.

ఈ సినిమాలో హీరోలుగా నితిన్ ఇంకా శర్వానంద్ ఉండనున్నారు అనే టాక్ కూడా వచ్చింది. కాని ఈ సినిమా అస్సలు ఉండదు నేను దిల్ రాజు కాంపౌండ్ లో సినిమా చెయ్యట్లేదు అని అధికారికంగా ప్రకటించాడు దహరీష్ శంకర్. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ "దిల్ రాజు గారు ఈ ఏడాది ఇంకా వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్న సినిమాల్లో నా సినిమా కూడా ఉండాలి, కాని లేదు..కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్నవి అన్ని జరగవు.

దిల్ రాజు గారికి అల్ ది బెస్ట్" అంటూ పోస్ట్ చేసాడు హరీష్ శంకర్. మరి ఈ ప్రాజెక్ట్ ఎందుకు కాన్సిల్ అయ్యింది అనే కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటె ఇప్పుడు హరీష్ శంకర్ ఏ ప్రొడ్యూసర్ తో కలిసి "దాగుడు మూతలు" తెరకేక్కిస్తాడు అని అందరు ఎదురు చూస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.