ఇంకొన్ని రోజుల పాటు ఫ్యామిలీ డ్రామాలు టచ్ చెయ్యను అంటున్న దిల్ రాజు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

dil raju
Updated:  2018-08-14 04:56:24

ఇంకొన్ని రోజుల పాటు ఫ్యామిలీ డ్రామాలు టచ్ చెయ్యను అంటున్న దిల్ రాజు

స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఫ్యామిలీ సినిమాలకి పెట్టింది పేరు. దిల్ రాజు నుంచి ఒక ఫ్యామిలీ సినిమా వస్తుంది అంటే ఆ సినిమా పై అందరిలోనూ భారి అంచనాలు ఉంటాయి. అయితే ఇటివలే దిల్ రాజు రిలీజ్ చేసిన "శ్రీనివాస కళ్యాణం" సినిమా పై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయింది.

పైగా సినిమాకి యూత్ లో భారీ నెగటివ్ టాక్ ఉంది. ఈ రేంజ్ లో టాక్ బయటకి రాగానే దిల్ రాజు ఇక ఫ్యామిలీ సినిమాలు ప్రొడ్యూస్ చేయవద్దు అని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. గత ఏడాది దిల్ రాజు ఆరు సినిమాలు రిలీజ్ చేస్తే ఆరు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి.

అందులో "శతమానంభవతి" అనే సినిమా కూడా ఒకటి. ఫ్యామిలీ సినిమాలు తీయాలి అంటే టైం కూడా అనుకూలంగా ఉండాలి అలాగే బలమైన స్క్రిప్ట్ కూడా దొరకాలి అని దిల్ రాజుకి అర్ధం అయినట్టు ఉంది. అందుకే మరో బలమైన కథ దొరికే వరకు ఫ్యామిలీ సినిమాలకి దూరంగా ఉంటాడు అంట దిల్ రాజు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.