కథా రచయిత గా మారిన దిల్ రాజు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

dil raju
Updated:  2018-07-23 05:32:58

కథా రచయిత గా మారిన దిల్ రాజు

దిల్ రాజు ప్రస్తుతం "శ్రీనివాస కళ్యాణం" అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నితిన్ ఇంకా రాశి ఖన్నా జంటగా నటించారు. అయితే ఈ సినిమాకి దిల్ రాజు కథని అందించాడు. ఈ విషయాన్నీ స్వయంగా దిల్ రాజు ఏ "శ్రీనివాస కళ్యాణం" పాటల వేడుకలో చెప్పాడు. దిల్ రాజు కి ఎప్పటి నుంచో పెళ్లి మీద ఒక సినిమా తీద్దాం అనే ఆలోచన ఉంది అట.
 
ఇది దృష్టి లో పెట్టుకొనే దిల్ రాజు ఒక లైన్ ని అనుకున్నాడు అంట, ఆ తరువాత "శతమానం భవతి" రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక దిల్ రాజు సతీష్ వేగ్నేశ కి కాల్ చేసి ఇంటికి పిలిచి ఈ లైన్ ని చెప్పాడు అంట. ఇక వెంటనే సతీష్ వేగ్నేశ ఇంకా తన ఇద్దరు అసిస్టెంట్స్ తో పాటు దిల్ రాజు కూడా కూర్చొని ఈ కథని పూర్తీ చేసారు అంట.
 
మనిషి అనే వాడు ఎవ్వడికైన పుట్టుక గురించి ఇంకా చావు గురించి తెలియదు, కానీ వాడికి తెలిసిన ఏకైక సంతోషం పెళ్లి. ఆ రోజు చుట్టాలు ఇంకా భందువులతో పాటు అందరం ఎంజాయ్ చేస్తాం. అందుకే ఈ సినిమాలో పెళ్లి యొక్క విలువ గురించి చెప్పాము అని అన్నాడు దిల్ రాజు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.