అల్లు అర్జున్ తో సినిమా చెయ్య‌ను దిల్ రాజు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-03 01:49:54

అల్లు అర్జున్ తో సినిమా చెయ్య‌ను దిల్ రాజు

 

స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఇంకా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో "సభకు నమస్కారం" అనే సినిమా రాబోతుంది అనే న్యూస్ బయటకి వచ్చింది. అయితే అసలు ఇలాంటి టైటిల్ మీద సినిమానే తియట్లేదు అని దిల్ రాజు ప్రకటించాడు. ఇది పక్కా ఫేక్ న్యూస్ అని బన్నీ తో సినిమా చెయ్యట్లేదు అని తేల్చి చెప్పేసాడు దిల్ రాజు.

"సభకు నమస్కారం" అనే టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉండటం అలాగే బన్నీ రాజు కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉండటంతో ఈ రూమర్ చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యింది. కానీ దిల్ రాజు ఇచ్చిన స్టేట్మెంట్ తో అందరూ ఈ రూమర్స్ ని ఇక్కడితో ఆపేశారు. ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్ లో "ఆర్య" "పరుగు" "దువ్వాడ జగన్నాధం" వంటి మంచి మంచి మూవీస్ వచ్చాయి.

ప్రస్తుతం దిల్ రాజు తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అలాగే అల్లు అర్జున్ కూడా ఇటివలే "నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా" సినిమాతో ఫ్లాప్ ని అందుకొని తన తదుపరి సినిమా వైపు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.