ప్రకాష్ రాజ్ తో గొడ‌వ‌కు అదే రీజ‌న్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-27 12:37:45

ప్రకాష్ రాజ్ తో గొడ‌వ‌కు అదే రీజ‌న్

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కుడు ఏయ‌స్ ర‌వి కుమార్ చౌద‌రి ప్రతీ ఒక్క‌రికి తెలిసినా, ప్రేక్ష‌కుల‌కు మాత్రం మ‌రిచిపోతున్నారు... ఆయ‌న ఫిలిం ఇండ‌స్ట్రీకి !!అమ్మ దొంగ!! సినిమా ద్వారా ప‌రిచ‌య‌మయ్యారు.. ఆ త‌ర్వాత 2004 లో ఏయ‌స్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం య‌జ్ఞం...ఈ చిత్రంలో గోపి చంద్ హీరోగా చేయ‌గా ఆయ‌న స‌ర‌స‌న  సమీరా బెనర్జీ న‌టించారు.
 
ఈ సినిమా మొత్తం రాయ‌ల‌సీమ, క‌ర్నూలు ఫ్యాక్ష‌నిజం గురించి ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ చౌద‌రి తెర‌కెక్కించారు.ఈ సినిమాతో  త‌న ఖాతాలో అతి పెద్ద విజ‌యాన్ని వేసుకున్నారు... ఈ చిత్ర త‌ర్వాత ఆటాడిస్తా, వీర‌భ‌ద్ర‌, సౌక్యం వంటి చిత్రాల‌కు ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.... అయితే ఈ సినిమాలు ఆయ‌న‌కు పెద్దగా విజ‌యాన్ని అందించ‌క‌పోయినా 2014లో తెర‌కెక్కిన చిత్రం పిల్లా నువ్వులేని జీవితం మంచి విజ‌యాన్ని అందించింది.
 
అయితే తాజాగా ఓ ప్ర‌ముఖ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఏయ‌స్ ర‌వికుమార్ చౌద‌రి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు... త‌న వ్య‌క్తి గ‌త జీవితంపై అలాగే తాను స‌క్సెస్ కాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాలు కూడా తెలిపారు ర‌వి...య‌జ్ఞం సినిమాలో త‌న కృషి చాలా ఉంద‌ని తెలిపాడు.
 
ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌కాశ్ రాజ్ నేను అనుకున్న విధంగా డైలాగ్ చెప్ప‌క పోవ‌డంతో క‌ట్..క‌ట్... అన్నాన‌ని ఆ స‌మ‌యంలో ప్ర‌కాశ్ రాజ్ ఎందుకు క‌ట్.. క‌ట్.. అన్నార‌ని ప్ర‌శ్నించారు.. ఓహో త‌ల‌పై చేయి పెట్ట‌నందుకా!.. నేను అవును అన్నాను దీంతో ఆయ‌న త‌న‌పై కోపం వ‌చ్చింద‌ని.... రెండునిమిషాల త‌ర్వాత మ‌ళ్లీ నేను చెప్పిన‌ట్లు ప్ర‌కాశ్ చేశార‌ని..ఇందులో ఏ వివాదం లేద‌ని తెలిపారు..
 
అందులో భాగంగానే తాను ప్ర‌కాశ్ రాజ్ చేసే పాత్ర‌ల‌న్ని తాను చేస్తాన‌ని అన్నారు ర‌వికుమార్ చౌద‌రి... అయితే ఆ ఛాన‌ల్ యాంక‌ర్ ఎలా చేస్తారో ఒక్క‌సారి చూపించ‌మ‌ని అడిగారు... దీంతో ఆయ‌న ప్ర‌కాశ్ రాజ్ ఆడ వేషం వేస్తే ఎలా ఉంటారో, అలాగే త‌ల్లి వేషం, కోడుకు వేషం, తండ్రివేషం, అన్నా, త‌మ్ముడు వేషం స్ప‌ష్టంగా వేసి చూపించారు.. ఆయ‌న‌ను అలా చూస్తుంటే అచ్చం ప్ర‌కాశ్ రాజ్ న‌ట‌న‌, మాట‌లు విన్న‌ట్లే అనిపిస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.