రివ్యూ రైటర్ ల విరుచుపడ్డ కొత్త డైరెక్టర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-15 01:19:21

రివ్యూ రైటర్ ల విరుచుపడ్డ కొత్త డైరెక్టర్

వెంకటేష్ మహా ప్రస్తుతం ఈ పేరు తెలియని సినిమా అభిమానులు ఉండరేమో. C/o కంచరపాలెం అంతటి కీర్తిని అతనికి కట్టబెట్టింది. ఈ సినిమా గురించి మాట్లాడని సెలెబ్రిటి లేరు. పొగడని సినిమా విలేఖరి లేడు. అయితే తాజాగా అయన చేసిని కొన్ని కామెంట్స్ వార్తల్లో నిలిచాయి. సినిమా హిట్ అయినప్పటికీ అయన రేటింగ్ ల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు కనిపింస్తుంది.
 
అయన ఒక ఇంటర్వ్యూ సందర్బంగా మాట్లాడుతూ రివ్యూ లు రేటింగ్ లు ఇచ్చేవాళ్ళు ఏ ఏ విషయాలను పరిగణలోకి తీస్కుని రేటింగ్ ఇస్తున్నారో చెప్పాలి. ఒక్కో వెబ్సైట్ ఒక్కో రేటింగ్ ఇవ్వడం ఏంటి. అంటూ రివ్యూ రైటర్ ల మీద మండిపడ్డాడు.వెంకటేష్ మహా ఇంకొంచెం ముందుకెళ్ళి ట్విస్ట్ ని చెప్పేసిన వారిపై మండిపడ్డాడు. ఒక్కొక్కర్ని తన మాటలతోనే శిక్షించినంతపని చేసాడు. 
 
అసలు ఈ సినిమా జర్నలిస్ట్ లు అంతా పద్దతిగా ట్రైనింగ్ పూర్తి చేసిన వారేనా? అంటూ ప్రశించాడు. వీరికన్నా మాములు సినిమా అభిమానులు చాల నయం వారు సామజిక మాధ్యమాలలో అసలైన రివ్యూ లు అసలైన రేటింగ్ లు ఇచ్చారు. ఏ ఒక్కరు కుడా ట్విస్ట్ ని రివీల్ చెయ్యకుండా చక్కగా రాసారు. కాని కొంత మంది వెబ్ సైట్ ల వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు రాసేసి ట్విస్ట్ లు చెప్పేసారు. దానివల్ల సినిమాకి వెళ్ళాలనే క్యురియాసిటి చచ్చిపోతుంది అంటూ వాపోయాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.