సైరాకు సంగీత ద‌ర్శ‌కుడు దొరికాడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

saira movie director
Updated:  2018-03-22 01:00:57

సైరాకు సంగీత ద‌ర్శ‌కుడు దొరికాడు

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా... ఈ సినిమాను ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు...ఈ సినిమాలో చిరంజీవి హీరోగా న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తున్నారు... అయితే ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండ‌వ షెడ్యూల్ లోకి అడుగు వేసినా  కానీ, ఇంత‌వ‌ర‌కూ చిత్ర‌యూనిట్ సంగీత ద‌ర్శ‌కుడిని మాత్రం ఫిక్స్ చేయ‌లేదు.  
 
గ‌తంలో సైరా సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా  ఏఆర్ రెహ్మాన్ ను అనుకున్నారు చిత్రయూనిట్... కానీ అత‌ని చేతిలో ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉండ‌డంతో తాను సైరా మూవీకి సంగీతం అందించ‌లేన‌ని హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో చెప్పారు రెహ్మాన్... దీంతో అత‌ని ఛాన్స్ త‌మ‌న్ కు ద‌క్కుతుంద‌ని కొంత కాలంపాటు వార్త‌లు వ‌చ్చాయి...కానీ ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియా పుణ్య‌మా అంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎమ్.ఎమ్. కీర‌వాణి పేరు వినిపించింది.. బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 వంటి బిగ్ చిత్రాల‌కు సంగీతం అందించిన కీర‌వాణి సైరా చిత్రానికి మ్యూజిక్ అందించ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.
 
కానీ తాజా టాలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం బాలీవుడ్ కు చెందిన అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందించ‌నున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది...ఆయ‌న మ్యూజిక్ అందించిన చిత్రాల‌కు సైరా చిత్ర యూనిట్ ప‌రిశీలించి త‌ర్వాత అమిత్ త్రివేది అయితే ఈ చిత్రానికి అనుకూలంగా సంగీతం అందిస్తార‌ని భావించి చిత్ర యూనిట్ ఇత‌నిని సెల‌క్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.