కథ వినగానే దర్శకుడికి ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood
Updated:  2018-08-20 11:35:02

కథ వినగానే దర్శకుడికి ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

ఇప్పుడు ఎక్కడ చూసిన "గీత గోవిందం" మానియానే. విజయ్ దేవరకొండ ఇంకా రష్మీక జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. "సోలో" "ఆంజనేయులు" ఫేమ్ అయిన పరశురాం ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. అయితే ఈ సినిమా కథని రెండేళ్ల క్రితమే పరశురాం నిర్మాత అయిన బన్నీ వాసు కి చెప్పాడు అంట.

పరశురాం మొదటి సారి ఈ కథ చెప్పగానే బన్నీ వాసు కి తెగ నచ్చేసింది అంట. అందుకే వెంటనే తాను అప్పుడే కొన్న ఫ్లాట్ ని అడ్వాన్స్ గా ఇచ్చేసాడు అంట బన్నీ వాసు. అలాగే పరశురాం డైరెక్ట్ చేసే నెక్స్ట్ సినిమా కూడా గీత ఆర్ట్స్ లొనే ఉంటుంది అని బన్నీ వాసు ప్రకటించాడు. గీత ఆర్ట్స్ లో ఒక దర్శకుడికి మూడో సారి అవకాశం రావడం ఇదే తొలిసారి అని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు. ఇకపోతే గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై కూడా వరసగా చిత్రాలు నిర్మిస్తాం.

త్వరలోనే ఆ సినిమాలని కూడా ప్రకటిస్తాం, వీటితో పాటు అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలు కూడా ప్రకటిస్తాం అని చెప్పాడు బన్నీ. ఇక తెలుగు రాష్ట్రాల్లో విజృభింస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ ని రాబడుతుంది. అయితే ఇది కేవలం విజయ్ దేవరకొండ క్రేజ్ వల్లే సాధ్యపడుతుంది అని అన్నవారు లేకపోలేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.