తన సినిమాలో తానే నటించనున్న దర్శకుడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood
Updated:  2018-07-30 10:52:58

తన సినిమాలో తానే నటించనున్న దర్శకుడు

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమా "ఎన్టీఆర్" బయోపిక్. క్రిష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే "మహానటి" సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన క్రిష్ ఇప్పుడు "ఎన్టీఆర్" బయోపిక్ సినిమా లో కూడా నటించబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. "మహనటి" సినిమా లో కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్ కనిపించాడు.
 
సినిమాలో క్రిష్ పాత్ర ఒక రెండు మూడు సార్లు వస్తూ ఉంటుంది. మళ్ళి ఇప్పుడు కూడా "ఎన్టీఆర్" సినిమా లో కూడా కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్ కనిపించబోతున్నాడు అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎన్టీఆర్ జీవితంలో కే.వి రెడ్డి పాత్ర చాలా కీలకం, అందుకే ఈ పాత్ర కోసం దర్శకుడు క్రిష్ నే నటించమని అడిగాడు బాలకృష్ణ.
 
ఇదిలా ఉంటే క్రిష్ ఇది వరకు తానూ డైరెక్ట్ చేసిన "గమ్యం" సినిమాలో క్లైమాక్స్ లో నక్సల్ పాత్రలో నటించాడు.  ఇప్పుడు మళ్ళి చాలా కాలం తరువాత తన దర్శకత్వంలో తానే నటించబోతున్నాడు క్రిష్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన విద్య బాలన్ కూడా ఒక ముఖ్యపాత్రలో నటిస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.