తెలుగు డైరెక్టర్ ని అవమానించిన బాలీవుడ్ నటి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood and bollywood
Updated:  2018-08-23 12:18:03

తెలుగు డైరెక్టర్ ని అవమానించిన బాలీవుడ్ నటి

"గమ్యం" అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తోలి సినిమాతోనే సక్సెస్ ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత క్రిష్ కి తెలుగు లో వరుస అవకాశాలు వచ్చాయి. అలాగే బాలీవుడ్ నుంచి కూడా క్రిష్ కి ఆకాశాలు వచ్చాయి. ఆల్రెడీ హిందీ లో అక్షయ్ కుమార్ ని హీరోగా పెట్టి మన "విక్రమార్కుడు" సినిమాని అక్కడ రీమేక్ చేసాడు క్రిష్.

ఇప్పుడేమో కంగనా రనౌత్‌ ని హీరోయిన్ గా పెట్టి "మణికర్ణిక" అనే సినిమా ని తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమా ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమా మొత్తాన్ని క్రిష్ ఏ డైరెక్ట్ చేసాడు. అయితే ఇప్పుడు కంగనా రనౌత్‌ వచ్చి ఇక మీద ఈ సినిమా పనులు మొత్తం నేను చూసుకుంటాను అని చెప్తుంది.

నిజానికి ఈ చిత్రానికి క్రిష్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ డైరెక్టర్‌ కాదు. వేరే దర్శకుడితో పేచీ పెట్టుకుని చివరి నిమిషంలో క్రిష్‌ని తీసుకుంది కంగనా. అయితే చాలా మంది ఇలాంటి రూమర్లు సహజమేనని ఎక్కువ కేర్‌ చేయలేదు. అయితే ఇప్పుడీ న్యూస్‌ లీకేజీతో క్లియర్‌గా ఈ సినిమా దర్శకత్వంపై తన మార్క్ ఉంది అని కంగనా స్పష్టం చేసింది. ప్రస్తుతం కిష తెలుగు లో "ఎన్టీఆర్" బయోపిక్ తో బిజీగా ఉండటమే దీనంతటికి కారణం అని తెలుస్తుంది. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.