న‌య‌న‌తార అలా బిహేవ్ చేసింది అందుకే గొడ‌వ ప‌డ్డాను

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine nayanathara and director maruthi
Updated:  2018-09-17 03:28:27

న‌య‌న‌తార అలా బిహేవ్ చేసింది అందుకే గొడ‌వ ప‌డ్డాను

అప్పుడెప్పుడో ఒకసారి నయనతార ప్రవర్తన బాలేదు అంటూ తమిళ్ సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది. ఆ తర్వాత ఒక వేదిక మీద అల్లు అర్జున్ ని కూడా దాదాపు అవమానం చేసింది. ఈ ఇలాంటి వార్తలు ఎం లేకపోయినా ఈ మలయాళముద్దుగుమ్మ తీరు మాత్రం మారలేదు. తాజాగా ఓ ఇంటర్వూ లో మాట్లాడుతూ దర్శకుడు మారుతి ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
 
ఆయన మాట్లాడుతూ  “నాలాంటి చిన్న వాళ్లకు గౌరవం ఇవ్వకపోయినా ఫరవాలేదు కానీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోని స్టార్ హీరోని గౌరవించాలా? లేదా?” అని ప్రశ్నించారు. నయనతార మాత్రం ఘోరంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శకులు మారుతి. మారుతి దర్శకత్వంలో వెంకటేష్ – నయనతార జంటగా ” బాబు బంగారం ” అనే చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా షూటింగ్ సమయంలో నయనతార చాలా రూడ్ గా బిహేవ్ చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.
 
నయనతారతో గొడవ గురించి మాట్లాడుతూ “నేనంటే చిన్న దర్శకుడినే, కానీ విక్టరీ వెంకటేష్ లాని సీనియర్ హీరోకి గౌరవం ఇవ్వకపోవడం నన్ను బాధించింది.అందుకే ఆమెతో కయ్యానికి దిగాను అంటూ వాపోయాడు. భారీ రెమ్యూనరేషన్ లకు అలవాటుపడ్డ ఈ ముదురు హీరోయిన్ అడపాదడపా తెలుగు చిత్రాల్లో కూడా మెరుస్తోంది. ఆమెకున్న డిమాండ్ వల్లనో మరి ఇంకా దేనివల్లనో తెలియదు కాని ఆమె తన సహనటులను అస్సలు ఖాతరు చేయదని వినికిడి. అంతేకాదు సినిమా చేస్తాను తప్ప ప్రమోషన్ కార్యక్రమాలకు రానని కూడా తేల్చి చెప్పేస్తోంది. ఇన్ని అవమానాలు చేస్తున్న దర్శకనిర్మాతలు ఈమెనే పెట్టి సినిమాలు తీస్తుండటం గమనార్హం.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.