దేవుడి ని వదిలే ప్రసక్తే లేదు అంటున్న పరశురాం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

diretor parasuram
Updated:  2018-08-30 11:09:59

దేవుడి ని వదిలే ప్రసక్తే లేదు అంటున్న పరశురాం

తెలుగు ఇండస్ట్రీ లో పరశురాం కి మంచి ఫ్యామిలీ డైరెక్టర్ గా పేరు ఉంది. గతంలో "సోలో" "శ్రీరస్తు శుభమస్తు" వంటి సినిమాలని డైరెక్ట్ చేసిన ఈయన ఇటివలే "గీత గోవిందం" తో కమర్షియల్ హిట్ ని తన ఖాతా లో వేసుకున్నాడు. అయితే పరశురాం తన తదుపరి సినిమాని కూడా "గీత గోవిందం" లాంటి సినిమాని ప్రొడ్యూస్ చేసిన గీత ఆర్ట్స్ లోనే చేయనున్నాడు.
 
ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది పూర్తిగా దేవుడికి మనిషి మధ్య జరిగే సంఘర్షణగా గా ఉంటుంది అంట. కానీ ఇదివరకు ఆల్రెడీ తెలుగు లో ఇదే కథ మీద "గోపాల గోపాల" సినిమా వచ్చింది. ఈ విషయం గురించి పరశురాం మాలడుతూ "గోపాల గోపాల సినిమాకి నేను చేయబోయే చిత్రానికి అస్సలు పోలిక లేదు.
 
ప్రస్తుతం ఈ స్క్రిప్టు మీదే పని చేస్తున్నాను. మంచి కథకి సరైన క్యారెక్టరైజేషన్స్ సెట్టయ్యాయి. సినిమా మొత్తం ఫుల్ వినోదాత్మకంగా సాగుతుంది. ఒక మనిషికి దేవుడికి మధ్య సాగే ట్రాక్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. స్క్రిప్ట్ బాగా వస్తోంది. కొత్తగా ఉంటుంది. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుంది" అని చెప్పుకొచ్చాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.